ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఎలా ఫ్లాప్ చేశారు..! ఈ సినిమా చూశారా..?

Ads

వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్. మంచు మనోజ్ గత కొంత కాలం నుండి సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. మంచు మనోజ్ గతంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేశారు. కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ, నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు చేశారు. అలా ఒక సినిమా 2016 లో వచ్చింది. ఆ సినిమా పేరు శౌర్య. ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు ఏమో. రెజీనా కసాండ్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

movie with great concept

సంతోషం సినిమాకి దర్శకత్వం వహించిన దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శౌర్య (మంచు మనోజ్), నేత్ర (రెజీనా) అనే ఇద్దరు చుట్టూ ఈ కథ నడుస్తుంది. టేకింగ్ పరంగా కొన్ని చోట్ల స్లోగా అనిపించినా కూడా చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఈ సినిమా తర్వాత టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అయినప్పుడు చూస్తే ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని అందరూ అనుకున్నారు. వేద ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మల్కాపురం శివకుమార్ ఈ సినిమాని నిర్మించారు.

Ads

ప్రకాష్ రాజ్, నాగినీడు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం మంచు మనోజ్ తనని తాను చాలా మార్చుకున్నారు. మంచు మనోజ్ పాత్ర కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెజీనా కసాండ్రాకి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమా తర్వాత మంచు మనోజ్ కొన్ని సినిమాల్లో నటించారు. 2018 లో సినిమాలు చేశాక మంచు మనోజ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యలో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా తర్వాత ఆగిపోయింది అనే వార్త వచ్చింది. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ఇటీవల మంచు మనోజ్ తాను మళ్ళీ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయం మీద ఇంకా వివరాలు రావాల్సి ఉంది.

Previous article“నా నవ్వులో నిన్ను గుర్తు చేసుకుంటా..!” అంటూ… పవిత్ర జయరాం చివరి పోస్ట్..! కంటతడి పెట్టిస్తున్న వీడియో..!
Next articleసెలబ్రిటీలు చెప్పేవన్నీ అబద్ధాలేనా..? లేదా మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా..? అసలు విషయం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.