Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో క్రీయాశీకలంగా ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కు ఏడాదిన్నర మాత్రమే ఉంది. ఇక జనసేనాని రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దానికి తగ్గట్టుగానే ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు.
ఎన్నికల దగ్గరకు వస్తుండడంతో ఆయన ప్రజల మధ్య ఉండేట్టు వ్యూహాన్ని సిద్దం చేసుకుంటున్నాడు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటన కోసం ప్రత్యేకమైన వెహికిల్ ను రెడీ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల సమరంలో పాల్గొనడానికి సిద్దంగా ఉంది అని, వాహనం వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఆ వాహనం డిజైన్ మరియు వాహనం పేరు చాలా డిఫరెంట్ గా ఉండంటంతో సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకుంటున్నారు.ఇంతకి పవన్ కళ్యాణ్ వారాహి అనే పేరునే తన వాహనానికి ఎందుకు పెట్టాడు? ఆ పేరుకి అర్దం ఏమిటి అని నెటిజెన్స్ వెతుకుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరం కోసం చేయించిన వాహనం పేరు వారాహి. ఇక ఈ పేరు వెనక చారిత్రక నేపథ్యం ఉంది.
Ads
విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన వరాహా అవతారం గురించి అందరికి తెలిసే ఉంటుంది. హిరణ్యక్షుడు అనే రాక్షసుడు వేదాలను తీసుకెళ్ళి, భూమిని సముద్రం లోపల దాస్తాడు. విష్ణుమూర్తి అప్పుడు వరాహ అవతారంలో వచ్చి ఆ రాక్షసుడిని వధించి వేదాలను కాపాడుతాడు. అలాగే భూమిని కూడా సముదంలోపలి నుండి బయటకు తీసుకువచ్చి యధా స్థానంలో పెడుతాడు.
జనసేనాని తన ప్రచార వాహనానికి వారాహి పేరు పెట్టడంతో, దాని వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు. సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలలో చైతన్యం తెచ్చి, వారి సమస్యల పై పోరాటం చెయాలని, తద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన చేయనున్నాడు. అందుకే దాన్ని తెలిపేలా, ప్రచార వాహనానికి వారాహి అని పెట్టారని జనసైనికులు అంటున్నారు. ఇక ఆ పేరు వెనక ఏ కారణం ఉన్నా, ప్రస్తుతం ఈ వాహనం గూర్చి మాత్రం నెట్టింట్లో చర్చించుకుంటున్నారు.
Also Read: రీల్ గానే కాదు… రీయల్ గా కూడా ఈ 11 మంది హీరోలే..!