ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో వెతికిన టాప్ 10 సినిమాల ఏమిటో తెలుసా?

Ads

ప్ర‌తి సంవత్సరం విడుదలైన సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్ష‌కులకు నచ్చుతాయి. అలా మ‌న‌సుకు నచ్చిన సినిమాల కోసం గూగుల్ లో వెతుకుతారు.

ఇక అలాగే ఈ ఏడాది భారతీయులు కొన్ని మూవీస్ గురించి ఎక్కువగా వెతికారు. ఇక ఈ విషయాన్నే గూగుల్‌ ప్రకటించింది. ఈ ఏడాది విడుదలయిన భారతీయులు సినిమాలలో వెతికినా టాప్ 10 సినిమాలు ఏమిటో చూద్దాం..1.బ్రహ్మాస్త్ర
భారతీయులు 2022లో అత్యధికంగా గూగుల్ లో వెతికిన సినిమాగా టాప్ ప్లేస్ లో ఉన్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడు అయాన్ ముఖర్జీ. 2. కేజీఎఫ్2
ప్రశాంత నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్2 ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా గూగుల్‌ సెర్చ్‌లో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సినిమా విదేశాల్లో కూడా సందడి చేసింది. యష్‌కి ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.3.ది కాశ్మీర్ ఫైల్స్
గూగుల్‌లో సెర్చ్ లో ఈ సినిమా మూడవ స్థానంలో నిలిచింది.వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఎన్నో వివాదాలతో రికార్డులు సృష్టించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే వందకోట్ల క్లబ్‌లో చేరింది.

4.ఆర్‌ఆర్‌ఆర్‌
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా జపాన్ లో కూడా అద్భుతమైన స్పందన పొందింది. గూగుల్‌లో సెర్చ్ లో 4వ స్థానంలో నిలిచింది.5.కాంతార
ఈ సినిమా 5 వ స్థానంలో నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాతో దేశ విదేశాల్లో గుర్తింపు పొందారు.

Ads

6.పుష్ప
గూగుల్‌లో సెర్చ్ లో ఈ సినిమా 6వ స్థానంలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లను రాబట్టింది. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్.7.విక్రమ్
గూగుల్‌లో సెర్చ్ లో ఈ మూవీ 7వ స్థానం పొందింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్, ఈ సినిమా ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన కోలీవుడ్ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా రూ.442 కోట్లు సాధించింది.8.లాల్ సింగ్ చద్దా
ఈ చిత్రం గూగుల్‌లో సెర్చ్ లో 8వ స్థానందక్కించుకుంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కరీనా కపూర్, నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా మూవీని ఆడియెన్స్ తిరస్కరించారు. నిర్మాతలు భారీగా నష్టపోయారు.కాగా ఓటీటీలో ఈ మూవీకి రెస్పాన్స్ వచ్చింది.
9.దృశ్యం 2
ఈ సినిమా గూగుల్‌లో సెర్చ్ లో 9వ స్థానంలో ఉంది. అజయ్ దేవగన్, శ్రియా శరణ్ నటించిన దృశ్యం 2 బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ కి భారీ కలెక్షన్లతో అజయ్ దేవగన్ పెద్ద హిట్ అందించాడు.10.థోర్: లవ్ అండ్ థండర్
గూగుల్ లో భారతీయులు అత్యధికంగా వెతికిన సినిమాల్లో హాలీవుడ్ సినిమా థోర్: లవ్ అండ్ థండర్ 10వ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకి తైకా వెయిటిటి దర్శకుడు.

Also Read: సీనియర్ ఎన్టీఆర్ నుండి అడివి శేష్ వరకు.. టాలీవుడ్ హీరోలు ఏం చదివారో తెలుసా?

Previous articleపవన్‌ కళ్యాణ్‌ ప్రచార రథం “వారాహి” పేరుకి అర్ధం ఏమిటో తెలుసా?
Next articleనిర్మాతలుగా మరి భారీగా నష్టపోయిన 10 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.