Ads
సినిమా ఒక భాషలో హిట్ అయ్యిందంటే సినిమాను వేరే భాషలోకి రిమేక్ చేయడం సర్వ సాధారణ విషయం. ఒక భాషలో హిట్ అయినంత మరో భాషలో విజయం పొందుతాయని చెప్పలేము.
కానీ మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఈ రిమేక్ లే పవర్ స్టార్ గా నిలబెట్టాయి.ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25 మూవీస్ చేస్తే, వాటిలో 12 రిమేక్ చిత్రాలే. వాటిలో తొమ్మిది సూపర్ హిట్లు అయ్యాయి. మరి అవి ఏమిటో చూద్దాం..1) గోకులంలో సీత:
పవన్ కళ్యాణ్, రాశీ జంటగా నటించిన ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ చేశారు. ఇది తమిళ్ సినిమా ‘గోకులతిల్ సీతై’ కు రీమేక్.2) సుస్వాగతం:
ఈ సినిమా తమిళ్ ‘లవ్ టుడే’ రిమేక్ . పవన్ కళ్యాణ్, దేవయాని కలిసి నటించిన ఈ సినిమాని భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్.3) ఖుషి:
తమిళంలో ఎస్.జె.సూర్య తీసిన ‘ఖుషి’ని, అదే టైటిల్ తో తెలుగులో రిమేక్ చేశాడు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్.4) అన్నవరం:
పవన్ కళ్యాణ్, ఆసిన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ భీమనేని శ్రీనివాస రావు. ఈ సినిమా తమిళ్ ‘తిరుపచి’ చిత్రానికి రీమేక్.
Ads
5 ) గబ్బర్ సింగ్:
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ పేరు తో రిమేక్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్టర్6) గోపాల గోపాల:
బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్ ఇది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకి డాలీ డైరెక్టర్.7) కాటమరాయుడు:
తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వీరం’ మూవీ రిమేక్ ఇది. ఈ సినిమాకి డాలీ డైరెక్టర్.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్.8 ) వకీల్ సాబ్ :
బాలీవుడ్ లో అమితాబ్, తాప్సి నటించిన ‘పింక్’ సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ డైరెక్టర్.9)భీమ్లా నాయక్
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. పవన్ కళ్యాణ్, రానా నటించారు.
Also Read: బాలకృష్ణ చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసాడు?