UGADI RASHI PHALALU 2024 – 2025: శ్రీ క్రోధి నామ సంవత్సర “ఉగాది” రాశి ఫలాలు 2024…ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.!

Ads

Ugadi Rashi Phalalu 2024 – 2025 తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఉగాది. ఇది తెలుగు వారికి నూతన సంవత్సరం. ఈసారి మనం శోభకృత్ నామ సంవత్సరం నుండి శ్రీ క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. సంవత్సరం మొదలు కావడంతో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని జ్యోతిష్యులు రాశి ప్రకారం అంచనా వేసి చెప్తారు. దాంతో ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది తప్పనిసరిగా పాటించే ఒక పద్ధతి అయిపోయింది. ఈసారి కూడా ఉగాదికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని జ్యోతిష్యులు చెప్పారు. ఏ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయాలు ఎంత, వ్యయాలు ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనేది చూద్దాం.

Ugadi Rashi Phalalu శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు రాశి ఫలాలు 2024-2025:

తిథి ప్రారంభం: ఏప్రిల్ 8, 2024 రాత్రి 12:12 గంటలకు

తిథి ముగింపు: ఏప్రిల్ 9, 2024 రాత్రి 10:10 గంటలకు

2024-2025 మేష రాశి ఫలితాలు :

మేష రాశి వారు సమయపాలన పాటిస్తారు. దాంతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో కూడా మంచి ఫలితాలు అందుతాయి.

ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3.

2024-2025 వృషభ రాశి ఫలితాలు :

వృషభ రాశి వారికి ధనవ్యయం ఉంటుంది. కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి. అయినా కూడా అవన్నీ అధిగమించి అనుకున్నది పూర్తి చేస్తారు. తెలివితో, ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు.

ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3.

2024-2025 మిథున రాశి ఫలితాలు :

మిథున రాశి వారు తెలిసి తెలియని పొరపాట్లు చేస్తారు. ఏ విషయంలో అయినా కూడా ఎవరిమీద ఆధారపడకపోవడం మంచిది. కొత్త వ్యవహారాలు కూడా చేపట్టకపోవడం సరైన నిర్ణయం.

ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6.

2024-2025 కర్కాటక రాశి ఫలితాలు :

కర్కాటక రాశి వారు సమయపాలన పాటించరు. కొన్ని పనులని వాయిదా వేయాలి అని అనుకుంటారు. స్నేహితులతోనూ. బంధువులతోనూ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి.

ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.

2024-2025 సింహ రాశి ఫలితాలు :

సింహ రాశి వారు కూడా సమయపాలన పాటించరు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని, భయాలకి గురవుతారు. సమయాన్ని వృధా చేసే పనులు చేయకూడదు. అందరితోనూ స్నేహంగా ఉండడం మంచిది.

Ads

ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2.

2024-2025 కన్యా రాశి ఫలితాలు :

కన్యా రాశి వారు రోజువారి కార్యక్రమాలు బాగా చేసుకుంటారు. అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక భయం ఉంటుంది. పుణ్యకార్యాలు చేయడం వంటి పనులు వాళ్ళు చేయాలి.

ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2.

2024-2025 తులా రాశి ఫలితాలు :

తులా రాశి వారికి మంచి కాలం ప్రారంభం అయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత వీరికి మంచి కాలం నడుస్తోంది. సమయాన్ని వృధా చేయకూడదు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి.

ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5.

2024-2025 వృశ్చిక రాశి ఫలితాలు :

వృశ్చిక రాశి వారికి సమయపాలన సరిగ్గా ఉండదు. ప్రతి నెలలో ఏదో ఒక సమస్య ఉంటుంది. వస్తువులు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా తీసుకోవడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5.

2024-2025 ధనస్సు రాశి ఫలితాలు :

ధనస్సు రాశి వారికి, అందులోనూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. కానీ స్నేహితుల మీద ఆధారపడి పనులు చేయడం తగ్గించాలి.

ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5.

2024-2025 మకర రాశి ఫలితాలు :

మకర రాశి వారికి రోజువారి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉండవు. గౌరవ మర్యాదలు ప్రభావం పడకుండా చూసుకోవాలి. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 .

2024-2025 కుంభ రాశి ఫలితాలు :

కుంభ రాశి వారికి ఏలినాటి శని వల్ల ఇబ్బందులు ఉంటాయి. కానీ అవి భయానికి గురి చేసే అంత పెద్దవి కాదు. ఉద్యోగ విషయాలలో కూడా మార్పు పొందాలి అనుకోక పోవడమే మంచిది.

ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1.

2024-2025 మీన రాశి ఫలితాలు :

మీన రాశి వారు రోజువారి కార్యక్రమాల్లో ఇబ్బందులు పడతారు. మీ గౌరవానికి, మర్యాదకి భంగం కలగకుండా చూసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారు ఉంటారు. వారి నుండి జాగ్రత్త పడండి.

ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 .

ఈ సంవత్సరం 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి.

Previous articleఈ ఫొటోలో ధనుష్ తో ఉన్న పాన్ ఇండియా స్టార్ ఎవరో గుర్తుపట్టారా.? అప్పుడు సైడ్ ఆర్టిస్ట్.!
Next articleఖుషి లాగే… “పవన్ కళ్యాణ్” నటించిన ఈ 9 సినిమాలు రీమేక్ లే అని తెలుసా.? ఎన్ని హిట్ అంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.