Ads
నారప్ప మూవీతో యాక్షన్ జోనర్ లో కూడా తన సత్తా చాటిన సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈసారి మరొక యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. పెదకాపు 1 అనే సరి కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ లో స్పెషాలిటీ ఏమిటి అంటే….ఈ సారి కేవలం డైరెక్షన్ చేసి ఊరుకోకుండా…ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ నటించాడు. అయితే ఈ రోజు విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం మేపించిందో చూద్దాము……
- మూవీ: పెదకాపు-1
- నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
- నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగా, రాజీవ్ కనకాల, అనుసూయ
- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
- సంగీతం : మిక్కీ జె మేయర్
- ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
- రిలీజ్ డేట్: 29 సెప్టెంబర్ 2023
స్టోరీ:
స్టోరీ విషయానికి వస్తే గోదావరి నదిలోని లంక గ్రామంలో నివసిస్తున్న పెద్దకాపు (విరాట్ కర్ణ) ఒక అణగారిన, వెనకబడిన వర్గానికి చెందిన వ్యక్తి. అదే ఊరిలో ఉన్న ఇద్దరు కుటిలమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకులు సత్య రంగయ్య ,బయన్న మధ్య జరిగే గొడవల కారణంగా ఎప్పుడు సమస్యలే. ఈ క్రమంలో భూస్వామ్య వాదనపై పెద్ద కాపు చేసే పోరాటం.. అతన్ని ఆ ఊరిలో వెనుకబడిన వర్గాలకు ఒక ఆసాకిరణంగా మారుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతని ఎదుగుదల.. ఈ తరహాలో సాగే చిత్రం. ఆ తర్వాత గ్రామ రాజకీయాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
Ads
కొత్త హీరో తో తీసినా…శ్రీకాంత్ మూవీ ను బాగా హ్యాండిల్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా బాగా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మూవీ పై అంచనాలు బాగా పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షో చూసిన సెలబ్రిటీస్ ఆన్లైన్ లో మాంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించిన శ్రీకాంత్ అడ్డాల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేష్ నారప్ప తర్వాత ఇది శ్రీకాంత్ కం బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు.
కుల అణచివేత , వర్గ వివక్ష లాంటి అంశాలను హైలైట్ చేస్తూ ఈ చిత్రం రామ్ చరణ్ రంగస్థలం మూవీ కి కాస్త దగ్గరగా అనిపిస్తుంది. మొత్తానికి మూవీ మంచి గ్రిప్పింగ్ కాన్సెప్ట్ తో ఆసక్తిగా ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చేటటువంటి ఎక్సలెంట్ హింసాత్మకమైన షార్ట్ మాంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వల్ సీన్స్, క్లైమాక్స్ ఎక్స్ట్రార్డినరీ గా ఉన్నాయి.
- ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ మూవీ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది.
- ఈ మూవీలో క్యారెక్టర్స్ , విజువల్స్ ,డైలాగ్స్.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచినట్లు తెలుస్తోంది.
మైనస్ పాయింట్స్:
- రచన ఇంకా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేది.
- ఫస్ట్ హాఫ్ కాస్త గందరగోళం ఉంటుంది.
- సెకండ్ హాఫ్ లో లాజిక్ మిస్ అయింది.
రేటింగ్:
2.5/5
టాగ్ లైన్:
ఒక మంచి సాంకేతిక విలువలతో కూడిన సినిమాను చూడాలి అనుకునే వాళ్లకు ఈ పెదకాపు 1 చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. అయితే మరీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం కాస్త నిరాశ చెందుతారు.
watch trailer :