గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి సందడి హీరోయిన్.

Ads

సాధారణంగా హీరోయిన్స్ సినిమాలకు, సినీ పరిశ్రమకి దూరమయ్యాక వారి అభిమానులు ఆ హీరోయిన్స్ ఎప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. లేదా ఆ హీరోయిన్స్ సోషల్ మీడియాలో కానీ, ఏదైనా టెలివిజన్ షోలతో వస్తారా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు.

అయితే కొంతమంది మళ్ళీ కనిపిస్తారు. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం ఇండస్ట్రీని విడిచి వెళ్ళిన తరువాత ఏళ్ళ తరబడి కనిపించకుండా ఉన్న హీరోయిన్లు ఉన్నారు. ఇక టాలీవుడ్ లో ఒకటి, రెండు చిత్రాలు చేసి అవకాశాలు రాక కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ గా 48కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రవళి. ఆమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీలో కూడా నటించింది.

Ads

తెలుగు ఆడియెన్స్ కి రవళి గురించి పరిచయం అక్కర్లేదు. రవళి ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో పుట్టి పెరిగింది. 1995లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘వద్దు బావా తప్పు’మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది. అడే ఏడాది మరోసారి శ్రీకాంత్‌తో ‘వినోదం’ అనే మూవీలో రవళి జత కట్టింది. ఈ రెండు చిత్రాలు రావాలిని సౌత్‌లో పాపులర్ అయ్యేలా చేశాయి. ఆ తరువాత హీరో జగపతి బాబుతో ‘శుభాకాంక్షలు’, నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’ చిత్రాలలో నటించింది.తెలుగులోనే కాకుండా రవళి తమిళంలో కూడా చాలా చిత్రాలలో నటించింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. రవళి శ్రీకాంత్, జగపతి బాబు, నాగార్జున,రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే కోలీవుడ్ లో విజయ్ కాంత్,పార్తీబన్, సత్యరాజ్ లతో, హిందీలో మిథున్ చక్రవర్తి వంటి హీరోలతో నటించి హిట్స్ అందుకుంది.
నీలికృష్ణ అనే వ్యక్తిని 2007లో వివాహం చేసుకుని, యాక్టింగ్ కి వీడ్కోలు చెప్పింది. రవళికి ఇద్దరు కూతుర్లు. ప్రస్తుతం సీరియల్ నటిగా చేస్తున్న హరిత రావాలికి సొంత సిస్టర్. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రవళి, తాజాగా తిరుమలలో దర్శనానికి రావడంతో కెమెరా దృష్టిలో పడ్డారు.ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన రవళి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఫ్యాన్స్ ఒకప్పటి తమ ఫేవరేట్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read:తెలుగులో రీమేక్ అయిన 10 మలయాళ చిత్రాలు, వాటి ఫలితాలు

Previous articleపవర్ స్టార్ కోసం ఉద్యోగం పోగొట్టుకున్న జూనియర్ సమంత..
Next article‘సై’ సినిమాలో రాజమౌళి, వేణు మాధవ్‌ సీన్స్ వెనుక ఉన్న స్టోరీ ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.