పవర్ స్టార్ కోసం ఉద్యోగం పోగొట్టుకున్న జూనియర్ సమంత..

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దేవుడిలా చూసే ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే లేడీ ఫ్యాన్స్ లో పవన్ కళ్యాణ్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

Ads

జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న అషురెడ్డి పవర్ స్టార్ కి కు వీరాభిమాని. ఓ భక్తురాలిగా పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఈ జూనియర్ సమంతకి ఎంత అభిమానం అంటే, పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఆమె ఏకంగా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుందంట. వివరాల్లోకి వెళ్తే, అషూ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం. దాంతో పవన్ కళ్యాణ్ కాటమరాయుడి మూవీ ప్రీమియర్ చూడడానికి జాబ్ కి లీవ్ పెట్టి, వెళ్ళినదంట.
మేనేజర్ కి అదే విషయం చెప్పి, లీవ్ కావాలని మెయిల్ పెట్టింది. ఇక ఆ మెయిల్ వల్లనే ఆమెను ఉద్యోగం నుండి తొలిగించారంట. జాబ్ పోవడంతో చాలా కష్టాలను పడాల్సి వచ్చిందని, అంతేకాకుండా ఫ్యామిలీ నుంచి కూడా ఇబ్బందులను ఎదుర్కొందట. అన్ని జరిగినా ఆ విషయంలో ఏరోజు రిగ్రెట్ గా ఫీల్ అవలేదని, పవన్ కళ్యాణ్ కు భక్తురాలిగా ఉండడం చాలా గర్వంగా ఉందని తెలిపింది.అయితే అప్పటి మెయిల్‌ను అషూ రెడ్డి ఇప్పుడు షేర్ చేసింది. అయితే ఆ మెయిల్ వల్ల అషూ రెడ్డి జీవితం మలుపు తిరిగిందనేది నిజమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అషు రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే కొంతమంది అభిమానం ఉండచ్చు కానీ, దాని కోసం ఉద్యోగం, జీవితం వదులుకోవడం మంచి పద్దతి కాదని కామెంట్స్ పెడుతున్నారు. తమఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని అభిప్రాయ పడుతున్నారు.

Also Read: అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ధరించిన హుడీ ధర ఎంతో తెలుసా?

Previous articleహీరో అబ్బాస్ కూతురి ముందు హీరోయిన్స్ కూడా దిగదుడుపే.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Next articleగుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి సందడి హీరోయిన్.
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.