Ads
కొంత మంది ఎక్కువ ఏదో ఒక పదాన్ని తరచూ మాటల్లో చెప్తూ ఊత పదంగా మార్చేస్తారు.ఇక అలాంటి అలవాట్లతో వారిని బాగా గుర్తు పెట్టుకుంటారు. ఇక ఇలాంటి వారు ఎక్కడ ఉన్న, ఏ పని చేసినా కూడా వారికున్న ఆ అలవాటు వారిని అందరిలో భిన్నంగా ఉంచుతుంది. టాలీవుడ్ లో అలాంటి మానేరిజం ఉన్న యాక్టర్ పోసాని కృష్ణమురళి.
Ads
తెలుగు సినీ పరిశ్రమలోకి పోసాని కృష్ణమురళి రైటర్ గా ప్రవేశించాడు. ఆ తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డారు. పోసాని పరుచూరి బ్రదర్స్ వద్ద పనిచేస్తున్న టైమ్ లో తన ప్రతిభతో మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో చాలా మూవీస్ లో మంచి పాత్రలు రావడంతో ఆయన అటుగా పయనించి, క్యారెక్టర్ యాక్టర్ గా స్థిరపడ్డారు.పోసాని సినిమాల్లో నటించిన కొన్ని పాత్రలు మంచి పేరును తెచ్చాయి. ఆయనకు చాలా అలవాట్లు కూడా ఉన్నాయి.
పోసాని తరుచుగా తన డ్రెస్ ని సరిగ్గా అనుకుంటూ కనిపిస్తారు. అంతేకాకుండా పోసాని ఏం మాట్లాడిన కూడా అందులో రాజా అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఎవరి నైనా మెచ్చుకోవడానికి,ఎంకరేజ్ చేయడానికి ఐ లవ్ యు రాజా అని చెప్తూ ఉంటారు. ఇలాంటి డిఫరెంట్ మానేరిజమ్స్ పోసానిలో ఉండటం వల్ల మిగతవారికన్న ఆయన భిన్నంగా ఉన్నారు. ఈ మానేరిజమ్స్ వల్ల ఆయన ఎంతమందిలో ఉన్నాకూడ ఈజిగా గుర్తు పడతారు.
ఇక పోసానికి ఈ అలవాట్లు రావడానికి కారణం ఏమిటి అంటే నటనలో భాగంగా ఆయనే అలవాటు చేసుకున్నాడంట. ఒక సందర్భంలో పోసాని పిల్లల ప్రోగ్రామ్ కి న్యాయనిర్ణేతగా చేసారు. దానిలో పిల్లలు సున్నితమైనవారు కాబట్టి, డ్యాన్స్ సరిగ్గా చేసినా, చేయకపోయినా వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఐ లవ్ యు రాజా అని అన్నాడట.దాంతో ఒక పిల్లడు కూడా థాంక్యూ రాజా అని అన్నాడంట. ఇక అది నచ్చి, పోసాని కృష్ణమురళి ఆ పదాన్నే మానేరిజంగా చేసుకున్నారు. ఇక అప్పటి నుండి అది బాగా పాపులర్ అయ్యింది.
Also Read: వైరల్ గా మారిన కృష్ణ వీలునామా.. కొడుకులను కాదు అని కోట్ల ఆస్తి వాళ్లకు రాశాడా?