Ads
రాజమౌళి ఎంతో అద్భుతంగా RRR సినిమాని తీసుకు వచ్చారు. నాటు నాటు పాట ఒక వండర్. నాటు నాటు పాట కి భారతీయ సినీ చరిత్ర లో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం. నామినేషన్స్ కి వెళ్లడమే కాదు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కి 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. ఇది నిజంగా ఎంతో గొప్ప విషయం.
కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా ఆస్కార్ ని కైవసం చేసుకుంది RRR సినిమా.
Ads
ఆస్కార్ అవార్డుల కోసం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇండియా నుండి వచ్చిన బెస్ట్ 14 సినిమాలని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ వాటిలో ఒకటి ఎంచుతుంది. ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరి లోకి పంపుతారు. ఈ సినిమాని ఆస్కార్ కి పంపలేదు. ఎవరికీ తెలీని ఓ ఛల్లో షోని కేంద్రం పంపించింది. ఒకవేళ కనుక ఆస్కార్ కోసం కేంద్రం ఈ మూవీ ని పంపితే ఆస్కార్ అవార్డు పక్కా వచ్చేది. అంత అదే అన్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డు 80 కోట్లు ఖర్చు చేసి కొన్నారు అనే కామెంట్ కి తాజాగా నిర్మాత దానయ్య కౌంటర్ ఇచ్చారు.
సినిమా ప్రాఫిట్ ఏ అంత రాదు. ఆస్కార్ కోసం ఎవరు అన్ని కోట్ల ని ఖర్చు చేస్తారు అని అన్నారు దానయ్య. సినిమా కోసం ఎంతో కష్ట పడాలి. పబ్లిసిటీ చేసుకోవాలి. తిరగాలి అని అన్నారు దానయ్య. సినిమా కోసం చాలా చోట్లు తిరిగాము. అటు విదేశాల్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాము అని చెప్పారు దానయ్య. రాజమౌళి గారు అలా చేసారు కనుక పాన్ ఇండియా లెవెల్ లో వేల్యూ వచ్చింది అన్నారు. అలానే నన్ను ఎవరు డీగ్రేట్ చెయ్యలేదు. అందులో ఏమి నిజం లేదని అన్నారు దానయ్య.