రూ. 80 కోట్లు మోసపోవడం వల్లే మేడలు అమ్మేశాడు… స్టార్ డైరెక్టర్ తల్లి కామెంట్స్.! అసలేమైంది?

Ads

తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ అంటే గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన హిట్ చిత్రాలను అందించారు.

Ads

చిన్న హీరోలను కూడా స్టార్లుగా మార్చిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. లైగర్ మూవీ ఫ్లాప్ కావడంతో  సమస్యలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా పూరీ జగన్నాథ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..ఇండస్ట్రీకి చెందినవారి జీవితాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఆర్థికంగా వారి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయనే విషయాన్ని ఎవరు ఊహించలేరు. బయటి నుండి చూసేవారికి వాళ్ళ జీవితం సంతోషంగా  ఉంటుందని భావిస్తారు. అయితే వాళ్లకు ఆర్ధిక సమస్యలు ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆలాంటి పరిస్థితినే దర్శకుడు పూరీ జగన్నాథ్ కు సైతం ఎదురయ్యింది. ఈ విషయాన్ని ఆయన తల్లి అమ్మాజి ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ “తన కొడుకు పడిన కష్టం మరెవరూ పడకూడదని అన్నారు. డిగ్రీ కాగానే సినిమా పిచ్చితో హైదరాబాద్ కు వచ్చి, ఇక్కడి ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగేవాడని తెలిపారు. 7వ  తరగతి చదువుతున్న సమయంలోనే సినిమాలంటే ఆసక్తి ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే పూరి డైరెక్టర్ అవకముందు హైదరాబాద్ కు ఒకసారి వెళ్తే పూరి కాళ్లు బాగా వాచిపోయాయని కొడుకు స్థితి చూసి  ఏడ్చేసానని వెల్లడించారు.
పూరి జగన్నాథ్ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి, నమ్మించి 80 కోట్ల రూపాయలు కొట్టేసాడని అన్నారు. ఆ తర్వాత ఓ మూవీ వల్ల భారీగా లాస్ రావడంతో ఫ్యామిలీ అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చినట్లు వెల్లడించారు. అప్పుడు పూరీ జగన్నాథ్ 5 ఇళ్ళు అమ్మేశాడని చెప్పారు.  మోసం చేసినవాడు తెలుసు దాంతో వాడి పట్టుకుందాం అని ఓ ఫ్రెండ్ అంటే, వద్దని ఆ వ్యక్తికి ఏదో  జన్మలో రుణపడి ఉన్నాం అందుకే ఇలా అయ్యిందని అన్నారు. దీనిని ఇక్కడే వదిలివేయమని, ఒంట్లో శక్తి ఉన్నవరకు కష్టపడతానని పూరి జగన్నాథ్ అన్నాడని అమ్మాజీ వెల్లడించారు.

Also Read: రకుల్ ప్రీత్ పెళ్లి గోవాలో.. ప్రధానిమోదీ చెప్పడం వల్లేనా..?

Previous articleOPERATION VALENTINE REVIEW: “వరుణ్ తేజ్” ఈసారైనా హిట్ కొట్టారా? “ఆపరేషన్ వాలెంటైన్” స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleతండ్రి వీలునామా రాయకపోతే పెళ్లయిన కూతురికి ఆస్తిలో వాటా ఉండదా.? న్యాయ శాస్త్రం ఏం చెప్తుంది!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.