Ads
చాలా మంది కృష్ణుడికి పూజలు చేస్తూ ఉంటారు. కృష్ణాష్టమి వంటి వాటిని కూడా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. దశావతారంలో ఒక్కో అవతారానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. పైగా ఒక్కో అవతారం కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. రాముడు అవతారం ని చూసినట్లయితే ధర్మబద్ధంగా మనం ఎలా ఉండాలి అనేది మనకి తెలుస్తుంది.
అదే కూర్మావతారంలో అయితే సాయం చేయడమే దైవం అని చెప్పారు. ఇలా మనం మన పురాణాల నుండి ఎన్నో విషయాలని తెలుసుకుంటూ వచ్చాము.
పురాణాలలో చాలా వాటిని మనం మన జీవితం లో ఆచరించచ్చు. అక్కడ ఎంతో మంచిని మనం తీసుకుని మన జీవితంలో వాడచ్చు. దాని వలన మన జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక మనం కృష్ణావతారం గురించి చూస్తే.. కృష్ణావతారంలో ఒక గురువు ఏ విధంగా ఉండాలి, ఇతరులకి మనం ఎలాంటి సలహాలు ఇవ్వాలి, దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఇతరులతో మాట్లాడాలి ఇటువంటి విషయాలు మనకి చెప్పారు. అయితే మనం కృష్ణుడిని పూజించేటప్పుడు రాధాకృష్ణులని పూజిస్తూ ఉంటాము. రాధ స్వార్ధం లేని ప్రేమ గురించి చెప్పారు. చిన్నప్పటి నుండి కూడా రాధా కృష్ణులు మంచి స్నేహితులు. కృష్ణుడి వేణునాధాన్ని విని రాధ పులకరించిపోయేది.
Ads
ఇక రుక్మిణి విషయానికి వస్తే రుక్మిణి పాత్ర ఓర్పు, సహనంతో ఎవరైనా మౌనంగా ఎలా ఉండాలి అనేది తెలుపుతుంది. రాధా రుక్మిణి కంటే ఏక్కువ ఏమీ కాదు. రుక్మిణి ఏమి రాధ కంటే తక్కువ ఏమీ కాదు. రాధ పాత్ర ప్రేమకు చిహ్నం అందుకని రాధాకృష్ణులు అని అంటారు. అయితే రుక్మిణి పాత్ర మాత్రం ప్రేమని ఉద్దేశించి కాదు. ప్రేమికులు ఎలా ఉంటారు అనేది రాధాకృష్ణుల్ని చూస్తే మనకి అర్థమవుతుంది అందుకే రాధాకృష్ణులని అనడం అలా పూజిస్తూ ఉండడం జరుగుతోంది. వీరిద్దరూ కూడా లక్ష్మీదేవి అవతారాలు. ఒక్కో అవతారం ద్వారా ఒక్కొక్కటి నేర్చుకుంటాం.