ఈ ఫోటోలో ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద హీరో..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

కొంత మంది హీరోలు తమ సినిమాల ద్వారా ప్రేక్షకులని అలరించడం మాత్రమే కాకుండా, సినిమా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక మార్పు తీసుకురావడానికి కారకులు అవుతారు. తన తోటి నటీనటులు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరచడంలో కూడా ఎంతో కృషి చేస్తారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని మార్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.

man with ntr is hero

ఆయనని కొంత మంది ప్రేమతో సీనియర్ ఎన్టీఆర్ గారు అంటారు. కొంత మంది అన్నగారు అని అంటారు. ఎప్పుడు ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అని కృషి చేస్తూ ఉండేవారు ఎన్టీఆర్ గారు. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మద్రాస్ లోనే ఉండేది. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండడం ఏంటి? మన రాష్ట్రంలో మన ఇండస్ట్రీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని అప్పటి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు.

Ads

ఇండస్ట్రీ మొత్తాన్ని ఇక్కడికి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఈ విషయం వల్ల మొత్తం ఇండస్ట్రీ అభివృద్ధి చెందింది. అందుకనే ఎన్టీఆర్ గారిని ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అందరూ అంత అభిమానిస్తారు. పైన ఫోటో ఎన్టీఆర్ గారు ఒక సినిమా సెట్స్ లో ఉన్న సమయంలోనిది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి పక్కన ఉన్న ఒక అబ్బాయి ఇప్పుడు చాలా పెద్ద హీరో అయ్యారు. ఆయనే నందమూరి బాలకృష్ణ.

నందమూరి కుటుంబం నుండి వచ్చిన బాలకృష్ణ, నటసింహంగా తనదైన ముద్ర వేసుకున్నారు. బాలకృష్ణ కూడా సినిమాల్లో చేస్తూ రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సదుపాయాలని అందిస్తున్నారు. ఈ ఫోటో బాలకృష్ణ మేకప్ వేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటో. అప్పుడు నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ తో మాట్లాడుతున్నారు. అప్పుడు తీసిన ఫోటో ఇది.

Previous articleGangs Of Godavari Review : “విశ్వక్‌ సేన్” హీరోగా నటించిన ఈ సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleGam Gam Ganesha Review : “ఆనంద్ దేవరకొండ” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.