Ads
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో సెప్టెంబర్ 24న కసరగడ్ నుంచి తిరువనంతపురం వెళ్ళే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ బ్లూ, వైట్ కలర్ లో కాకుండా కాషాయ రంగులో ఉంది. ఇలా కాషాయ రంగులో ఉన్న రైలు అందుబాటులోకి రావడం తొలిసారి.
అయితే వందేభారత్ఎక్స్‌ప్రెస్ కు కాషాయ రంగు వేయడం పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో కూడా ఈ రంగు పై పెద్ద సంఖ్యలో పోస్ట్‌లు చేశారు. తమ పార్టీ రంగునే రైళ్ళకు వేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విమర్శల పై తాజాగా రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 24 కొత్తగా తొమ్మిది వందేభారత్ ట్రైన్స్ ను వర్చువల్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో కేరళలోని తిరువనంతపురం నుండి కాసర్‌గోడ్ వెళ్ళే రైలు కాషాయ రంగులో ఉంది. ఈ రంగు పై అటు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇటు నెట్టింట్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి.
Ads
ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందేభారత్ రైలుకు కాషాయ రంగులో ఉపయోగించడం పై క్లారిటీ ఇచ్చారు. రైలుకు కాషాయ రంగును వాడడం వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని, ఆ రంగును సెలెక్ట్ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ మాత్రమే ఉందని వెల్లడించారు.
మంత్రి మాట్లాడుతూ “సాధారణంగా మన కంటికి పసుపు, కాషాయ రంగులు బాగా కనిపిస్తాయి. అందువల్లే ఐరోపా దేశాల్లో సుమారు 80 శాతం ట్రైన్స్ పై పసుపు, కాషాయ రంగుల కాంబినేషన్ ఉపయోగిస్తారు. ఈ రంగుల లాగే సిల్వర్ ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా రంగులు బాగా కన్పించినప్పటికీ, కాషాయ, పసుపు కలర్స్ మాత్రమే మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రంగును ఎంపిక చేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, నూటికి నూరుశాతం సైంటిఫిక్ రీజన్ మాత్రమే” అని మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read: నా భార్య రెండో పెళ్లి చేసుకుంది అని కేసు వేసాడు…చివరికి కోర్టు అతనికే షాక్ ఇచ్చింది..!