Ads
రాజకీయ నాయకులు అందరూ దాదాపుగా కోటీశ్వరులే అని ఎక్కువమంది భావిస్తారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధిస్తేనే, ఆస్తులు కూడగట్టేసుకుంటున్నారు. అయితే కొందరు నాయకులు మాత్రం ఎలాంటి ఆస్తులు సంపాదించకుండా ప్రజల శ్రేయస్సు కోసమే పని చేశారు.
Ads
అలాంటి వారిలో గుర్రం యాదగిరిరెడ్డి ఒకరు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా. కనీసం సొంతిల్లు కూడా కట్టుకోకుండా, మచ్చలేని లీడర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న గుర్రం యాదగిరిరెడ్డి గురించి ఇప్పుడు చూద్దాం..
యాదగిరి రెడ్డి 1931లో ఫిబ్రవరి 5న యాదాద్రి జిల్లాలోని సుద్దాల గ్రామంలో జన్మించాడు. వ్యవసాయం చేస్తూ, గొర్రెల కాపరిగా జీవనం సాగించాడు.15 ఏళ్ల వయస్సులోనే గుతుప సంఘానికి పాలు అందచేస్తూ గెరిల్లా దళంలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన మూడు ఎకరాల భూమితో పాటు ఇచ్చిన పాత పెంకుటింట్లోనే ఆఖరి వరకు జీవించాడు. చిన్నతనం నుండి ఉద్యమ భావాలు ఉన్న యాదగిరి రెడ్డి కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేవాడు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి సీపీఐ పార్టీ తరపున 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పదిహేను ఏళ్ళలో నియోజకవర్గ అభివృద్ధికి కోసం ఎంతో కృషి చేశారు. గ్రామాలకు రోడ్లు, మంచినీరు, కరెంట్ వంటి సౌకర్యాలను కల్పించడమే కాకుండా స్కూల్స్, ప్రభుత్వ భవనాల ఏర్పాటు చేయడంలో విశేషమైన కృషి చేశారు.
ప్రజల కష్టాలను తీర్చి ఎమ్మెల్యేగా అనేక ప్రశంసలను అందుకున్నారు. ఎమ్మెల్యే అయినా కూడా హంగు ఆర్భాటాలకు వెళ్ళకుండా సామాన్య వ్యక్తిగా జీవించడం యాదగిరి రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. యాదగిరి రెడ్డికి నలుగురు సంతానం, ఇద్దరుకు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు రాజశేఖరరెడ్డి లాయర్, చిన్న కుమారుడు గుర్రం రాంమోహన్‌రెడ్డి ఒక పత్రికలో రిపోర్టర్‌గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. ఆయన తన పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్, కళాశాలల్లోనే చదివించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Also Read: తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే రిపోర్ట్…బీజేపీకి పెద్ద షాక్…అన్నే సీట్లు అంట.?