Ads
హీరో నాగశౌర్య అనగానే మంచి క్లాస్ చిత్రాలు గుర్తొస్తాయి. చాలాకాలం నుంచి నాగశౌర్య మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘ఛలో’ మువీ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కట్లేదు. తాజాగా ‘రంగబలి’ తో బ్లాక్ బస్టర్ కొట‍్టబోతున్నామని నాగశౌర్య ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- సినిమా : రంగబలి
- నటీనటులు : నాగశౌర్య,యుర్తి తరేజ,గోపరాజు రమణ,షైన్ టామ్ చాకో,సత్య,శరత్ కుమార్,మురళీ శర్మ,శుభలేఖ సుధాకర్ తదితరులు
- నిర్మాత : సుధాకర్ చెరుకూరి
- దర్శకత్వం : పవన్ బాసంశెట్టి
- సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
- సంగీతం : పవన్ సీహెచ్
- విడుదల తేదీ: జులై 7, 2023.
స్టోరీ:
రాజవరంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా బలాదూర్ గా తిరుగుతూ షో చేస్తుండే యువకుడు శౌర్య(నాగశౌర్య). దాంతో అతన్ని అందరు ‘షో’ అని పిలుస్తుంటారు. శౌర్యకు తన ఊరంటే పిచ్చి. బతికినా, చచ్చినా అనుకుంటాడు. అలాంటి శౌర్యను తండ్రి పనిమీద వైజాగ్ పంపిస్తాడు. వైజాగ్ కు వెళ్ళిన శౌర్య మెడికల్ స్టూడెంట్ సహజ (యుక్తి తరేజా)ని చూసి ప్రేమిస్తాడు.
సహజ కూడా శౌర్యని ప్రేమిస్తుంది. తమ పెళ్లి గురించి శౌర్య, సహజ తండ్రి (మురళీ శర్మ)ని కలిసి మాట్లాడుతాడు.ఆ సందర్భంలో ‘రంగబలి’ సెంటర్ గురించి చెప్తాడు. అప్పుడు సహజ తండ్రి తన కుమార్తె పెళ్లి చేసుకోవాలంటే ‘రంగబలి’ సెంటర్ వదిలి, వైజాగ్‌లో స్థిరపడాలని కండిషన్ పెడుతాడు. అసలే సొంతూరు అంటే పిచ్చి ఉన్న శౌర్య ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ.
రివ్యూ:
Ads
ఫస్టాప్ మొదటి నుండే స్లోగా కథలోకి వెళ్లిపోయింది. హీరో ఎంట్రీ మంచి ఎలివేషన్‌తో ఉంటుంది. తరువాత ఫైట్. అనంతరం హీరో చుట్టూ పరిస్థితులు ఒక్కొక్కటిగా చూపించారు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తీశాడు. ఫస్టాప్ ను పూర్తిగా కథ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఇక సెకండాఫ్ లో అసలు కథను చూపించాడు. కానీ ఇప్పటికే చాలా చిత్రాలలో చూసేసిన స్టోరీలా అనిపిస్తుంది. క్లైమాక్స్ సిల్లీగా అనిపిస్తుంది. సినిమాకు చివరికి మారని ఊరి ప్రజలు క్లైమాక్స్ హీరో చిన్న స్పీచ్ ఇవ్వడంతో మారుతారు.
ఇలాంటి పాత్రలు హీరో నాగశౌర్యకు కొట్టిన పిండి అని చెప్పవచ్చు. నాగశౌర్య తనదైన ఈజ్‌తో నటన, కామెడీ, డ్యాన్సులు అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కొన్నిచోట్ల అవసరం లేకున్నా బాడీని చూపించాడు. ఫైట్లు చేశాడు. కథకి తగ్గట్లు అవి లాజిక్‌గా ఉంటే బాగుండేది. హీరోయిన్ కి అంతగా స్కోప్ దక్కలేదు. హీరోతో ప్రేమ సన్నివేశాలు, రెండు మూడు సాంగ్స్ లో కనిపించింది. మిగిలిన యాక్టర్స్ లో సత్య ఫస్టాప్ ని తనదైన కామెడీతో నడిపించాడు.
గోపరాజు రమణ శౌర్య తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు సెకండాఫ్ లో అంతగా స్పేస్ ఇవ్వలేదు.విలన్‌గా నటించిన మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. విలన్ పాత్రకు సరైన సన్నివేశాలు పడలేదు. సెకండాఫ్ లో శుభలేఖ సుధాకర్, శరత్ కుమార్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు తమ పాత్రల మేయరకు నటించారు.
పవన్ సీహెచ్ పాటలు అంతగా గుర్తుండవు. పాటలు సందర్భం లేకుండా వచ్చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి. రచయిత మరియు దర్శకుడు పవన్ బాసంశెట్టికి ఇది మొదటి సినిమా. కథ, కొన్ని సీన్లపై మరింత దృష్టి పెట్టాల్సింది.
ప్లస్ పాయింట్స్:
- నాగశౌర్య నటన,
- సత్య, గోపరాజు రమణ
- కామెడీ సన్నివేశాలు,
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు:
- రొటీన్ స్టోరీ
- కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండడం,
రేటింగ్:
2.5/5
watch trailer :