Ads
ఇది వరకు కంటే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దాంతో క్షణాల్లో మన పనులు మనం పూర్తి చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఇబ్బంది ఉండదు. కేవలం మనతో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం క్యాబ్ ఓ ఆటోనో లేకపోతే బైకో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ర్యాపిడో గురించి మీరు వినే ఉంటారు ర్యాపిడో ద్వారా చాలా మంది బైక్స్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఒక సంఘటన జరిగింది కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరులో 30 ఏళ్ల యువతి ఒక ప్రైవేట్ కంపెనీ లో ఆర్కిటెక్ గా పని చేస్తున్నారు.
ఈ నెల 21వ తేదీన రాత్రి 11 గంటలకి ఇందిరా నగర్ వెళ్లడానికి ర్యాపిడో బైక్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఆ బైకర్ ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. తర్వాత మొబైల్ ఫోన్ ని లాక్కున్నాడు. బైక్ స్పీడ్ పెంచి చాలా తప్పుగా ఆమె పట్ల ప్రవర్తించాడు. ఆమెని కౌగలించుకున్నాడు కూడా.
Ads
ఇలా ఆమెని బాధ పెట్టాడు. పైగా వెళ్లే దారిలో కాకుండా వేరే రూటు తీసుకువెళ్లాడు. ఎందుకు అటువైపు తీసుకు వెళ్తున్నామని ఆమె అడిగింది. సమాధానం ఇవ్వకుండానే స్పీడ్ గా తీసుకువెళ్లాడు ఆ బైకర్. అతను తాగి డ్రైవ్ చేస్తున్నట్లు ఆమె గమనించింది. భయం తో స్నేహితురాలికి పోలీసులకి కూడా ఫోన్ చేసి సహాయాన్ని కోరింది.
బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ దగ్గర బండి మీద నుండి ఆమె దూకేసింది. గాయపడింది. ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేస్తున్నారు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జరగడంతో ర్యాపిడో బైక్ సురక్షితం కాదా అని అనుమానాలు వస్తున్నాయి యువతులకి మహిళలకు ఇది సేఫ్ ఏనా కాదా అని సందేహ పడుతున్నారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాత్రిపూట జాగ్రత్తగా ట్రావెల్ చెయ్యండి.