Ads
తెలుగు రాష్ట్రాలలో అత్యంత విజయవంతమైన రాజకీయ నాయకుల పేర్లు అడిగితే ముందుగా వచ్చే పేర్లు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు. ఆ తరువాత వైఎస్ఆర్. ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం సినిమాలను వదిలిపెట్టి, తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా,గెలిచి ఒక ప్రాంతీయ పార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఇక ఎన్టీ రామారావు తరువాత చంద్రబాబు టీడీపీని ముందుకు నడిపించారు.
చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో మాస్టర్స్ చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా చేసాడు. ఆ తరువాత 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. పులిచెర్ల యూత్ లీడర్ గా చంద్రబాబు క్రియాశీల పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇక 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 28ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్యే అయిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆ తరువాత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీ రామారావుతో సన్నిహితంగా ఉండి, 1982లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
అయితే ఎన్టీ రామారావు టిడిపి పార్టీని ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.ఆ తరువాత ఎన్టీ రామారావుతో పరిచయం అయిన తరువాత 1980లో ఆయన మూడవ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. మొదట్లో చంద్రబాబు మాత్రం చేరలేదు. 1983లో చంద్రగిరి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇక 1983 ఎలెక్షన్స్ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. ఆయన తక్కువ కాలంలోనే టిడిపిలో ముఖ్యనేతగా ఎదిగారు. 1985 వరకు కూడా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఎన్టీ రామారావు రాజకీయాల నుండి తప్పుకోవడంతో చంద్రబాబు టీడీపీకి నాయకుడు అయ్యాడు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తరువాత 1999లో వరుసగా రెండవ సారి ముఖ్యమంత్రిగా చేశాడు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్‌ని ఎంతో అభివృద్ధి చేశారు. పరిపాలన,హైదరాబాద్‌లోని ఐటీ పరిశ్రమ, రోడ్లు, సంక్షేమ పథకాలు ఇలా అన్నిటిలోను తనదైన మార్క్ చూపించాడు. నారా చంద్రబాబు నాయుడు అరుదైన, ఇప్పటి వరకు చూడని ఫోటో గ్యాలరీ ద్వారా చూద్దాం..
1.2.
Ads
3.
4.
5.6.7.8.
9.
10
11.
Also Read: ప్రధానికి సెక్యూరిటీ కల్పించే ఎస్‌పీజీ కమాండోకు ఎంత సాలరీ ఇస్తారు..?, ఎలా ఎంపిక చేస్తారు..?