‘భగవంత్ కేసరి’లో “రతిక రోల్ ఏంటో తెలుసా.? 5 నిమిషాల పాత్రకి అంత రెమ్యూనరేషనా.?

Ads

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ దసరా కానుకగా నిన్న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. డబుల్ హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

భగవంత్ కేసరిగా బాలయ్య డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో తెలుగు అమ్మాయి, బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌ రతికా రోజ్ నటించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి మూవీకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మూవీలో బాలయ్య, శ్రీలీల క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ మూవీతో బాలకృష్ణ ఖాతాలో హ్యాట్రిక్ చేరినట్టే అనే టాక్ వినిపిస్తోంది. కామెడీ సినిమాలను తెరకెక్కించే అనిల్ రావిపూడి ఈ మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్‌‌ గా రూపొందించారు.
అయితే ఈ చిత్రంలో బిగ్ బాస్ 7 బ్యూటీ రతికా రోజ్ ఒక పాత్రలో కనిపించి, ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. నాలుగవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన రతిక, ఈ చిత్రంలో కనిపించగానే థియేటర్స్‌లో కేకలు వినిపించాయట. ఆమె బిగ్ బాస్‌ షోలో పాల్గొనకపోతే ఆ పాత్రను ఎవరూ పట్టించుకునే వారు కాదు. రతిక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా బాగా పాపులర్ అయ్యింది.
ఈ మూవీలో రతికా రోజ్ యంగ్ ఎమ్మెల్యే పాత్రలో నటించింది. విలన్ గ్యాంగ్‌లో ఉండే పొలిటీషియన్ గా నటించినట్టు తెలుస్తోంది. మూవీలో కనిపించింది కాసేపే అయిన రతిక ఇంగ్లీష్ లో మాట్లాడే ఎమ్మెల్యే పాత్రలో ఆకట్టుకున్నారని టాక్. ఈ మూవీలో తన పాత్ర గురించి రతిక మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మూవీతో రతికా రోజ్ జాతకం మారిపోనుందని కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటె..‘భగవంత్ కేసరి’లో రతిక రోల్ చిన్నదే అయినా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారంట. నిజానికి సినిమాలో రతిక స్క్రీన్ ప్రెసెన్స్ 5 నిమిషాలు మాత్రమే. ఆ రోల్ కి నిర్మాతలు ఆమెకి 5 లక్షల రూపాయిలు ఇచ్చారట. అంత తక్కువ నిడివి ఉన్న పాత్ర కి ఆ రేంజ్ పారితోషికం తక్కువేమి కాదు.

Also Read: విరూపాక్ష సీక్వెల్…కానీ ట్విస్ట్ ఏంటంటే.? హీరో సాయి ధరమ్ తేజ్ కాదు.! మరి ఎవరు?

 

Previous articleరిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్లారు…కానీ అక్కడ చేదు అనుభవం.! ఏమైందంటే.?
Next articleమహేష్ బాబు మూవీ తో శుభోదయం సుబ్బారావు గారు గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఎవరో మీకు తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.