Ads
ఎప్పుడైనా…ఎక్కడైనా మీరు ట్రైన్ చూసినప్పుడు…. పట్టాల మీద వెళ్లే ట్రైన్ తన పైన ఉన్న వైర్లకు ఒక హుక్కు లాంటి దాంతో టచ్ చేస్తూ వెళ్తుంది. ఈ వైర్ లను ఓహెచ్ఈ వైర్లు, అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్లు అని అంటారు.
అసలు ఆ వైర్లు ట్రైన్ ట్రాక్ పైన ఎందుకు ఉంటాయి? ట్రైన్ తగలడం వల్ల అవి ఎప్పుడైనా తెగుతాయా? అన్న డౌట్ మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. అసలు మనలో చాలామందికి ఆ వైర్ల వల్ల కలిగే ఉపయోగం ఏమిటో కూడా తెలియదు.. మరి అసలు ఆ వైర్లు ఏమిటి…అనే విషయం తెలుసుకుందాం….
మామూలుగా ఏదన్నా మనం కట్ చేయాలి అనుకుంటే అది అంత సులభంగా ఒకేసారి కట్ అవ్వదు. దానిమీద ప్రెషర్ పెడితేనే ఆ వస్తువు కట్ అవుతుంది. ఫిజిక్స్ ప్రకారం కాన్స్టంట్ ఫోర్స్ అప్లై చేయండి ఏ వస్తువు కట్ కాదు. అయితే ఇక్కడ ట్రైన్ వైర్లకు తగిలినప్పుడు ఎటువంటి ఫోర్స్ అప్లై చేయదు కాబట్టి అవి కట్ అయ్యే ఆస్కారం ఉండవు.
Ads
ఎందుకంటే లోకోమోటివ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ ఫోర్స్ అనేది దానికి అప్లై అవ్వదు. ట్రైన్ పైన అంటినా లాగా ఉండి వైర్లకు తగిలే భాగాన్ని పాంటోగ్రాఫ్ అంటారు. . దీని ద్వారా ఎలక్ట్రిసిటీ వైర్ల నుంచి లోకోమోటివ్ ట్రాన్స్ఫార్మర్ కు చేరుకుంటుంది.ఓ ఎచ్ ఈ కి తగిలే పాంటోగ్రాఫ్ భాగాన్ని షూ లేదా ప్యాన్ అని అంటారు.ఈ షూ కి ఒక పల్చటి లేయర్ లాగా గ్రాఫైట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. గ్రాఫైట్ కి ఎప్పుడు కూడా మెల్టింగ్ పాయింట్ చాలా హాయిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేడిని తట్టుకొని సస్టైన్ అవుతుంది.
గ్రాఫైట్ ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్ గా పని చేస్తుంది.. కాబట్టి షాక్ లాంటివి జరిగే ఆస్కారం ఉండదు. అయితే షూ మీద వేసిన గ్రాఫైట్ లేయర్ పల్చబడిన తర్వాత దానిని తిరిగి మారుస్తూ ఉంటారు. పైన ఉన్న వైర్ కి పాంటోగ్రాఫ్ తగిలినప్పుడు ఎటువంటి ఫ్రిక్షన్ ,హిట్ ఏర్పడకుండా గ్రాఫైట్ ఒక మంచి లూప్రింట్ గా పని చేస్తుంది. అయితే క్రమంగా పైన ఉన్నటువంటి వైర్లు కొన్ని సందర్భాలలో డ్యామేజీ అవుతాయి…. అలాంటప్పుడు వాటిని మార్చడం జరుగుతుంది.