NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 8 మంది టాలీవుడ్ హీరోయిన్లు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

Ads

అమెరికా పెళ్లి సంబంధాలు అన్నా, ఎన్నారై లతో వివాహం అంటే సాధార‌ణ అమ్మాయిల‌కు మాత్రమే కాకుండా ఎంతో పాపులారిటీ పొందిన హీరోయిన్స్ కూడా చాలా ఆసక్తి చూపిస్తారని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కొంద‌రు కెరీర్ త‌ర‌వాత విదేశాలలో స్థిరపడాలని, మరికొందరు ప్రేమ‌లో ప‌డి విదేశీ యువ‌కులను పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొంత మంది టాలీవుడ్ హీరోయిన్స్ ఎన్నారైలను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యారు. అలా పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవ‌రో చూద్దాం..

1.మాధవి
అలనాటి నటి మాధవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 300 సినిమాల్లో నటించింది . మాతృదేవో భవ సినిమాతో ఆమె ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 1986లో, మాధవి స భారతసంతతికి చెందిన జర్మన్ అయిన రాల్ఫ్ శర్మను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ఈ జంటకి ముగ్గురు కుమార్తెలు.

Tollywood Heroine Mahdavi With Her Husband2.రంభ
సీనియ‌ర్ హీరోయిన్ రంభ టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు అగ్రనటిగా ఉన్నారు. ఆమె అందానికి అప్పటి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. హీరోయిన్ రంభ కెన‌డాకు చెందిన‌ ఇంద్ర‌న్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.

Telugu Heroine Rambha with Her Husband and Children Images3.అపర్ణ
హీరోయిన్ అపర్ణ అంటే చాలామందికి తెలియయక పోవచ్చు. కానీ సుందరకాండ అపర్ణ అంటే ఆడియెన్స్ గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో వెంకటేష్, మీనా నటించారు. అపర్ణ శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని, USA లో స్థిరపడ్డారు. అపర్ణ-శ్రీకాంత్‌కి ఒక అబ్బాయి.

4.మీరాజాస్మీన్
మీరాజాస్మీన్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది. పందెం కోడి సినిమాతో మీరా జాస్మిన్ అభినయంతో ఆక‌ట్టుకుంది.అనిల్ జాన్ అనే వ్య‌క్తితో ప్రేమ‌ వివాహం చేసుకుని, న్యూజెర్సీలో సెటిల్ అయ్యింది. అయితే వీరిద్ద‌రూ తరువాత విడిపోయారు.

Ads

Heroine Meera Jasmine with Her Husband Marriage Images5.గోపిక
ర‌వితేజ నా ఆటోగ్రాఫ్ స్విట్ మెమ‌రీస్ లో నటించిన హీరోయిన్ గోపిక తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంది. ఆ సినిమా త‌ర‌వాత కొన్ని సినిమాలలో న‌టిచిన గోపిక అజిలేష్ చాకో అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

6.ప్రీతిజింటా
సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా ప‌రిచ‌యం అవసరం లేని పేరు. టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో న‌టించింది. తెలుగులో ప్రేమంటే ఇదేరా,రాజకుమారుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. జీని గుడ్ ఇన‌ఫ్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

7.రాధికా అప్టే
రాధికా అప్టే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ర‌క్త చ‌రిత్ర మూవీలో ప‌రిటాల సునిత పాత్రలోనూ, బాల‌కృష్ణకు జంటగా లెజెండ్ సినిమాలో న‌టించింది. ఆ త‌ర‌వాత లండ‌న్ వ్యక్తి అయిన బెన‌డిక్ట్ టేల‌ర్ ను పెళ్లాడింది.

8.లయ
నటి లయ స్వయంవరం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన లయ ఎన్నారై డాక్టర్ డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె స్లోకా మరియు కుమారుడు వచన్ ఉన్నారు.

Telugu Heroine Laya with Her Family, Children Images

Also Read: టాలీవుడ్ లో కులాంత‌ర వివాహాలు చేసుకున్న 8 మంది హీరోలు ఎవరో తెలుసా?

Previous articleరైలు ఇంజిన్ అంత వేగంగా వెళుతూ విద్యుత్ తీగలను తాకుతున్నా…అవి ఎందుకు తెగిపోవో తెలుసా.?
Next articleమన 5 రూపీస్ కాయిన్స్ తో “బంగ్లాదేశ్‌” అలా చేసేసరికి…ఆ కాయిన్స్ ని ఇండియా లో బ్యాన్ చేసారని తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.