Ads
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వతహాగా మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల పవన్ ఫైటింగ్ సీన్స్ ఎంతో డిఫరెంట్ గా మరియు అట్రాక్టివ్ గా చేస్తారు. పవన్ కళ్యాణ్ డిబేట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి తనలోని ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తూ వచ్చారు.
అయితే ఇది కేవలం సినిమాల కోసం నేర్చుకున్న విద్య అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పవన్ కి మొదటి నుంచి చదువు పెద్దగా వచ్చింది లేదు.. అందుకే ఎంతవరకు కుదిరితే అంతవరకే చదువుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాలలో పవన్ డైరెక్ట్ గానే చెప్పారు. దీంతో చాలామంది సినిమాల్లో రావడం కోసం చదువు ఎలా రాలేదు కాబట్టి ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఏమో అని అభిప్రాయపడుతుంటారు. కానీ పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వెనుక అసలు రీసన్ వేరే ఉంది.
Ads
నిజానికి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది తన అన్న చిరంజీవి కోసం. చిరంజీవి సినీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత తన తమ్ముళ్లను కూడా అదే ఫీల్డ్ లో ప్రోత్సహించారు. నాగబాబుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చిరంజీవి చాలా ప్రయత్నించారట కానీ నాగబాబు ఆసక్తి చూపించక పోవడం తో విరమించుకున్నారు. పవన్ కు కూడా మొదటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదట.
చెన్నైలో పవన్ కాలేజీ చదువుకునే రోజుల్లో కొందరు చిరంజీవి సినిమాలు చూసి వచ్చి అతని గురించి తెగ కామెంట్ చేసేవారట. కావాలని పవన్ కళ్యాణ్ ముందే తన అన్నయ్య యాక్టింగ్ మరియు లుక్స్ గురించి విపరీతంగా విమర్శించేవారు. అన్న అంటే విపరీతమైన ప్రేమ ఉన్న పవన్ కు ఇటువంటివి విన్నప్పుడు ఆవేశం వచ్చేదట. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ సన్నగా సైకిల్ రాడ్ లా ఉండేవాడు. వాళ్లని ఎదిరించలేను అని భావించిన పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.