బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే చింత చెట్టుకు కల్లు..

Ads

వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చింతచెట్టుకు కల్లు పారుతుంది అని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అది నిజమవుతుందా అంటే పాలకుర్తి ప్రజలు అవుననే అంటున్నారు.

Ads

జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న చింత చెట్టుకు నుండి కల్లు పారుతున్నట్టు ఆ ఇంటి యజమాని ఎల్లబోయిన సోమ్మళ్ళు గమనించారు. దాంతో ఆ నోటా ఈ నోటా పాకి గ్రామా ప్రజలంతా వచ్చి ఆశ్చర్యంతో ఈ విచిత్రాన్ని చూస్తున్నారు. ఇక ఈ సంగతి కాస్త వాట్సాప్ గ్రూపుల్లో కూడా వైరల్ అవడంతో చుట్టు పక్కల గ్రామల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ విడ్డురాన్ని చూస్తున్నారు.కల్లు సాధారణంగా ఈత చెట్టు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు,ఖర్జురా చెట్లకు,వేప చెట్లకు తీయడం వింటూ ఉంటారు. ఇలా చెట్లనుండి తీసిన కల్లును తాగడానికి చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇక వేప చెట్టు కల్లును ఆయుర్వేదం ఔషదాల్లో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం పాలకుర్తిలో చింత చెట్టు నుండి కల్లు పారడం పెద్ద చర్చకు దారి తీసింది. హఠాత్తుగా చింత చెట్టు రంగు మారడం, చెట్టు నుండి కల్లు పారడంతో అక్కడున్న ప్రజలకు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ఆ వింత దృశ్యాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. గ్రామస్తులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లే ఇప్పుడు జరుగుతుందని, ఎలాంటి ఆపద ముంచుకొస్తుందేమోనని అక్కడి వారు భయపడుతున్నారు.అయితే కొందరు చింతచెట్టుకి కల్లు రావడంలో వింత ఏమీ లేదని అంటున్నారు. అంతేకాక వేప చెట్టు, మర్రి చెట్టు అలాగే చింత చెట్టు లాంటి కొన్ని చెట్లకు రోగాలు వచ్చినపుడు, చెట్టుకి ఎక్కడైనా కట్ అయితే అక్కడ బాక్టీరియా లాంటివి వచ్చినపుడు నురగలాంటిది సాధారణంగా వస్తుందని అంటున్నారు. జనం మాత్రం ఆ వింతను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఉన్న స్థల యజమాని మాత్రం నిన్న మేము పెద్దమ్మతల్లికి బోనాలు పెట్టి, నేడు పండుగను జరుపుకుంటున్నాం. అందువల్ల పండుగ రోజున దైవేచ్ఛ వల్లే చెట్టు నుంచి కల్లు పారుతోందని అంటున్నారు.

Also Read: ఆలయంలోని ఆ స్థంభం గాల్లో వేలాడుతూ ఉండడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా..?

Previous articleపవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వెనక కారణం ఆ వ్యక్తి..!
Next articleసూపర్ స్టార్ కృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీళ్లే…
Sravan - Movies, offbeat, Sports & Health News Correspondent with 5 years of experience in Journalism