Ads
ఈ మధ్య కాలంలో పెద్దపెద్ద అపార్ట్మెంట్స్ వంటివి వస్తున్నాయి. ఏకంగా 10 ఫ్లోర్లు దాటి ఉన్న అపార్ట్మెంట్లుని కూడా ఈరోజుల్లో కట్టేస్తున్నారు. అలానే షాపింగ్ మాల్స్ కి ఆసుపత్రిలు కి కూడా ఎక్కువ ఫ్లోర్లు ఉంటాయి. అటువంటప్పుడు మనం మెట్ల మీద నుండి వెళ్లడం ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ లిఫ్ట్ వచ్చిన తర్వాత పైకి వెళ్లడం చాలా ఈజీగా ఉంటుంది. కేవలం మనం డోర్ తీసి లిఫ్ట్ లోకి వెళ్లి అక్కడ వుండే బటన్స్ ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ కి ఈజీగా క్షణాల్లో మనం వెళ్లిపోవచ్చు.
రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఇటువంటివి చాలానే వస్తున్నాయి. లిఫ్ట్ లో మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే బటన్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్ కావాలంటే మనం ఆ ఫ్లోర్ కి వెళ్లడానికి అక్కడ ఉండే బటన్ ని నొక్కితే సరిపోతుంది. అప్పుడు మనం ఏ ఫ్లోర్ కి వెళ్లాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా గమనించినట్లయితే ఆ ఫ్లోర్ బటన్ల కింద చిన్న చిన్న చుక్కలు ఉబ్బెత్తుగా ఉంటాయి.
Ads
మీరు కనుక చేతి వేళ్ల తో తడిమితే అవి మీకు అర్థమవుతాయి. పైకి కూడా అవి చూడడానికి కనబడతాయి. ఇక బటన్ కింద చుక్కలు ఎందుకు ఉంటాయంటే మామూలుగా చూపు ఉన్న వాళ్లకి బటన్స్ క్లియర్ గా కనబడతాయి. దాంతో మనం ఆ బటన్ దేనికి అనేది ఈజీగా తెలుసుకుని ఆ బటన్ ని వాడతాము. కానీ చూపు లేని వారు ఎలా వెళ్తారు.. అందుకే అండి ఈ బటన్స్ కింద చుక్కలు ఉంటాయి.
అంధులు కూడా బటన్స్ ని ప్రెస్ చేసే విధంగా వీటిని డిజైన్ చేస్తారు. బ్రెయిలీ లిపి ఈ బటన్స్ ని గుర్తించడానికి హెల్ప్ అవుతుంది. అందుకే ఆ చుక్కల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో బ్రెయిలీ తెలిసిన అంధులు ఈజీగా బటన్ ప్రెస్ చేయడానికి అవుతుంది. అందుకనే లిఫ్ట్ లో బటన్ కింద చుక్కలు ఉంటాయి. కానీ అదేదో డిజైన్ అనుకుంటే అది పొరపాటే.