భార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 పనులు అస్సలు చేయకూడదు..!

Ads

భార్య గర్భిణీగా ఉన్న సమయంలో తన భర్త సపోర్ట్ ని కచ్చితంగా ఇవ్వాలి. నవ మాసాలు బిడ్డని మోయడం అంత సులభం కాదు. ఈ తొమ్మిది నెలలలో రకరకాల సమస్యలని ఎదుర్కొంటూ ఉంటుంది గర్భిణి. అలాంటిటప్పుడు కుటుంబ సభ్యులు తోడు భర్త తోడు తప్పక ఉండాలి. సపోర్ట్ చేస్తూ ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంత మంది అత్తమామలు గర్భిణీ అయినా కూడా బండ చాకిరీ చేయాలని అంటూ ఉంటారు.

గర్భిణీ అయినా కూడా బరువులు మోయడం వంటివి కొంత మందికి తప్పవు కానీ నిజానికి కుటుంబ సభ్యులు భర్త తప్పకుండా ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పోషకాహారాన్ని అందేటట్టు చూసుకోవాలి. తగినంత రెస్ట్ ని ఇవ్వాలి. బిడ్డ జన్మించిన తర్వాత కూడా భర్త, కుటుంబ సభ్యులు బిడ్డని, తల్లిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి.

నిజానికి బిడ్డ పుట్టిన తర్వాత శారీరకంగా మానసికంగా ఆ తల్లికి ఇబ్బంది ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉండదు. ఇటువంటి సమయంలో కచ్చితంగా భర్త తోడు ఎంతో అవసరం. అయితే భార్య గర్భవతి అయినప్పుడు భర్తలు తప్పకుండా వీటిని పాటించాలి.. ఈ తప్పులను అస్సలు చేయకూడదు.

Ads

  • భార్య గర్భవతి అయ్యాక ఆరు నెలల పాటు భర్త షేవింగ్ కానీ హెయిర్ కటింగ్ కానీ చేయించుకోకూడదు.
    భార్య గర్భిణీ అయినప్పుడు సముద్ర స్నానానికి భర్త వెళ్ళకూడదు.
  • చెట్లు నరకడం వంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే అరిష్టం.
  • భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏడవ నెల దాటిన తర్వాత అంతిమ యాత్రలకు వెళ్ళకూడదు. భర్త పడవలను కూడా అసలు ఎక్కకూడదు.

  • భర్త విదేశీ యాత్రలకి కూడా అస్సలు చేయకూడదు. ఆమెకి దూరంగా వెళ్ళకూడదు భర్త. అంతిమయాత్రలో పాల్గొనడం స్మశానానికి వెళ్లడం కూడా అస్సలు మంచిది కాదు. ఆ తప్పుని కూడా చేయకూడదు. శవ యాత్రలో పాల్గొనడం, ప్రేత కర్మలు చేయడం. పిండి దానం చేయడం వంటివి భర్త చేయకూడదు.
  • భార్య గర్భం దాల్చాక పర్వతారోహణ చేయరాదు.
  • గృహప్రవేశం చేయకూడదు, ఇంటి స్తంభానికి ముహూర్తం పెట్టకూడదు, వాస్తు కర్మకి దూరంగా ఉండాలి.
Previous articleలిఫ్ట్ లో బటన్స్ కింద చుక్కలు ఎందుకు ఉంటాయి..? దాని వెనుక కారణం ఏమిటో తెలుసా..?
Next articleఒకటి కంటే ఎక్కువ గణేష్ విగ్రహాలు ఉన్నాయా..? అయితే ఇలా మాత్రం అస్సలు చెయ్యకండి..!