Ads
జనం మార్పు కోరుకుంటారు.. ఏళ్ల తరబడి పాలిస్తున్నాం కదా అని గుడ్డి నమ్మకం పెట్టుకుంటే ఎదురుదెబ్బ తగలక మానదు.. నిన్న మొన్నటి వరకు తెలంగాణ మొత్తం నాదే అంటూ విర్రవీగిన కేసీఆర్ ఈనాడు కనివిని ఎరుగని రేతిలో ఓటమిపాలవ్వడానికి కారణం కూడా ఇదే. తెలంగాణ ఏర్పడింది మొదలుకొని పదేళ్లపాటు సుదీర్ఘమైన తమ పాలనలో ఎన్నో చేశామంటూ చెప్పుకొచ్చాడు కేసీఆర్. కానీ నిజానికి చేయాల్సినవి చేశానా అని ఒక్కసారి కూడా ఆత్మ విమర్శ చేసుకోలేదు. అదే జరిగి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. కెసిఆర్ ఓటమికి కారణాలు ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..
#1. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాదు.. అయినా సరే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చలేక పోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు ఫేవర్గా మార్చుకోవడంలో సఫలం అయింది.
Ads
#2.వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే లకే పార్టీ మళ్ళీ సీట్ ఇవ్వడం మైనస్ అయ్యింది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకుండా మొండి ధైర్యంతో ముందుకు వెళ్లి నష్టపోయాడు.
#3. కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగే అవినీతిలను కూడా హైలైట్ చేయడంలో ప్రతిపక్ష పార్టీలు సఫలమయ్యాయి.
#4. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుపేదలకు అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కొందరికి నచ్చితే..కొందరికి నచ్చలేదు. ప్రజల మంచి కోసం చేసిన ఇలాంటి పథకాలు కూడా అక్కడక్కడ బెడిసి కొట్టాయి.
#5. మరి ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టిఆర్ఎస్ అంటూ ప్రచారం చేసిన కేసీఆర్ ఆ తరువాత పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా పెద్దగా అచ్చి రాలేదు. దీనికి తోడు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని వచ్చిన పుకారు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది.