సూప‌ర్ స్టార్ కృష్ణ ‘సింహాస‌నం’ సినిమాకి పెట్టింది రూ.3.50 కోట్లు.. ఎంత వ‌చ్చిందో తెలుసా ?

Ads

సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి టాలీవుడ్ ఆడియెన్స్ కి ప్ర‌త్యేకంగా పరిచయం చేయాల్సిన ప‌నిలేదు. ఆయ‌న తన కెరీర్ లో 350 కి పైగా సినిమాలలో న‌టించారు. వాటిలో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇక తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆయన సంచలనాలకు మారు పేరుగా నిలిచారు.

Ads

టాలీవుడ్ కి ఎన్నో ర‌కాల టెక్నాల‌జీల‌ను ఇంట్రడ్యూస్ చేసిన ఘ‌న‌త సూప‌ర్ స్టార్ కృష్ణకే సొంతం. అంతేకాకుండా తొలి కౌబాయ్ చిత్రం, తొలి క‌ల‌ర్ చిత్రం, తొలి గూఢ‌చారి చిత్రాలను తెలుగు వారికి పరిచయం చేసింది కూడా ఆయ‌నే. ఇలా చెప్పుకుంటూ పోతే నటశేఖర కృష్ణ పేరిట చాలా రికార్డులు నమోదు అయి ఉన్నాయి. అయితే సూప‌ర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్‌లో భారీ హిట్ అయిన సినిమాలలో సింహాస‌నం మూవీ కూడా ఒక‌టి. ఆరోజుల్లో సింహాస‌నం సినిమా సృష్టించిన ప్ర‌భంజ‌నం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
హీరో కృష్ణ నటించిన సింహాస‌నం మూవీని ఇప్ప‌టి బాహుబ‌లి చిత్రంతో పోల్చ‌వ‌చ్చు. అప్ప‌ట్లో ఈ సినిమా ఒక ట్రెండ్‌ను సృష్టించింది. 1980ల‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ జాన‌ప‌ద చిత్రాన్ని తీయాల‌నే కోరికతో సింహాస‌నం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకి బ‌డ్జెట్ ఎక్కువగా అవుతుందని, ఆలోచించి రూ.3.50 కోట్ల‌తో ఈ మూవీని తీయాల‌ని భావించారు. అయితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కనుక ప్రొడ్యూసర్స్ చాలా న‌ష్ట‌పోతార‌ని కృష్ణ భావించి, తానే స్వ‌యంగా ప‌ద్మాల‌యా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అలా ఆయన నిర్మాతగా మరి ఈ చిత్రాన్ని తీశారు. అంతేకాకుండా ఈ సినిమాకి ఆయ‌నే డైరెక్షన్ కూడా చేశారు.
ఇక సింహాస‌నం మూవీ తీసే స‌మ‌యంలో ప్రతి రోజూ వార్తా పేప‌ర్ల‌లో ఈ సినిమా షూటింగ్‌కు గురించిన వార్త‌లు వచ్చేవి. దాంతో ఈ చిత్రం పై ఆడియెన్స్ లో భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌, రాధతో పాటు బాలీవుడ్ హీరోయిన్ మందాకిని కూడా న‌టించారు. ఈ సినిమా చిత్రీకరణను కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేసారు. అయితే ఆరోజుల్లో ఒక మూవీ తీయాలంటే రూ.50 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌ను కేటాయించేవారు. కానీ ఈ సినిమాకు రూ.3.50 కోట్లు పెట్టి తీసి సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద సాహ‌సం చేశారు.
అంతే కాకుండా ఈ సినిమాని తెలుగుతోపాటుగా, హిందీలోనూ తీశారు. హిందీలో జితేంద్ర హీరోగా చేశారు. 1986 మార్చి 21న ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలోనూ సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేసింది. ఊహించిన దానిక‌న్నా కూడా అధికంగా ఈ సినిమాకి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఆడియెన్స్ నుండి విప‌రీత‌మైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టిక్కెట్ల కోసం 12 కి.మీ. వరకు లైన్‌లు క‌ట్టారు.
మొద‌టి వారంలో ఈ సినిమా రూ.1.51 కోట్ల గ్రాస్‌ను, ఒకే థియేట‌ర్‌లో రూ.15 ల‌క్ష‌ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. వైజాగ్ లో 100 రోజులు ఆడింది. మూడు సెంట‌ర్ల‌లో ఈ మూవీ పది ల‌క్ష‌ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక మొత్తంగా చెప్పాలంటే రూ.7 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఇది ఆరోజుల్లో చాలా ఎక్కువ. ఈ సినిమా 100 రోజుల వేడుక‌ను చెన్నైలో చేశారు. అయితే ఈ వేడుక కోసం సూప‌ర్ స్టార్ కృష్ణ అభిమానులు 400 బ‌స్సుల్లో వ‌చ్చి చరిత్ర సృష్టించారు. ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అలా కృష్ణ సింహాస‌నం ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

Also Read: అజిత్ తెగింపు సినిమా రివ్యూ.. టాక్ ఎలా వుందంటే?

Previous articleDINESH KARTHIK: ఐపీఎల్ లో RCB ప్లేయర్ “దినేష్ కార్తీక్” ధరించే హెల్మెట్ ఎందుకు భిన్నంగా ఉంటుంది.?
Next articleచిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా మీకు తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.