చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా మీకు తెలుసా..?

Ads

చిరంజీవి, బాలకృష్ణ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఇద్దరు కూడా టాలీవుడ్ లో అగ్ర నటులు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. పైగా ఈ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే హంగామా మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ కి జోష్ వస్తుంది.

ఈ హీరోల సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు నుండి కూడా టికెట్ల కోసం క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో సార్లు థియేటర్లలో ఒకే సారి చిత్రాలని రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోలు కూడా పోటీ పడడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు మీకు కూడా తెలీదా..?

ఆశ్చర్యపోతున్నారా అయితే కచ్చితంగా మీరు దీనిని చూడాల్సిందే. 60 ఏళ్లు దాటిన కూడా బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరు కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. వరుస సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు వారి చిత్రాలతో పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంలో ఇద్దరి కాంబోలో సినిమా చేస్తారని అడిగితే మైత్రి ప్రొడ్యూసర్స్ చిరు బాలయ్య కలిసి నటించిన ఒప్పుకుంటే అవకాశాన్ని ఏ ప్రొడ్యూసర్ కూడా వదులుకోరు అని చెప్పారు.

Ads

megastar-vs-balayya-prathidvani

మంచి స్టోరీ దొరికితే కచ్చితంగా చేస్తామని అన్నారు. చిరు బాలయ్య సినిమా కుదిరితే ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అందులో సందేహం లేదు. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక చిత్రంలో గతంలో కనపడ్డారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు సినిమా అది. అయితే ఈ సినిమాలోని ఒక పాటలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ కనబడుతారు.

వీళ్ళు మాత్రమే కాదు సూపర్ సార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు ఈ సాంగ్లో కనపడ్డారు ఈ సినిమా తర్వాత మళ్లీ చిరంజీవి బాలకృష్ణ ఏ సినిమాలలోను కనపడలేదు. ఎన్నో ఏళ్ల నుండి చిరు ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఇప్పటివరకు అది జరగలేదు రాబోయే రోజుల్లో ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Previous articleట్విస్టులు మాములుగా లేవుగా.? OTT లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ సినిమా చూసారా?
Next articleవిరూపాక్ష సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన ఆమె ఎవరు..? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?