Ads
ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన దేశ వ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే దేశమంతటా జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటే ఒక దగ్గర మాత్రం జనవరి 29న రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నారు. మరి ఎక్కడ జనవరి 29న రిపబ్లిక్ డేను జరుపు కుంటున్నారో? ఇలా చేయడం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని ప్రముఖ దేవాలయంలో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 29వ తేదీన జరుపుకోబోతున్నారు. అక్కడి వినాయకుడి ఆలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈసారే కాకుండా ప్రతి ఏడాది కూడా జనవరి 26న కాకుండా వివిధ తేదీల్లో జరుపుకుంటారు. అయితే వారు ఇలా చేయడానికి కారణం కూడా ఉంది. ఇక ఆ ఆలయంలో హిందూ క్యాలెండర్ ప్రకారమే వేడుకలను జరుపుకునే సంప్రదాయం ఉంది. అందువల్ల వారి ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ జాతీయ పండగలను కూడా ఆ క్యాలెండర్ ప్రకారంగానే జరుపుకుంటారంట.
Ads
హిందూ పండుగలు, తీజ్ అలాగే వార్షికోత్సవాలను ఆంగ్ల తేదీ ప్రకారం జరుపుకోవడం హిందూ గ్రంథాల్లో లేదని, పంచాంగం ప్రకారంగానే అన్ని పండుగలను జరుపుకోవాలని ఆ ఆలయంలోని పూజారులు అంటున్నారు. సంవత్సరాల తరబడి ఆ ఆలయంలో అదే పద్దతిని పాటిస్తున్నారు. అయితే ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950లో జనవరి 26 ఆరోజు మాఘమాసం శుక్ల పక్షమీ తిథి అష్టమి. ఇక వారు పంచాంగం ప్రకారంగా మాఘమాసంలో అష్టమి తిథి ఎప్పుడు వస్తుందో ఆరోజునే గణతంత్ర దినోత్సవ వేడుకలను చేస్తారు.
ఈ ఏడాది అష్టమి తిధి జనవరి 29న వచ్చింది. అందువల్ల 29న ఉజ్జయిని పెద్ద గణపతి ఆలయంలో రిపబ్లిక్ డేను వైభవంగా జరుపుకుంటారు. దేశం శ్రేయస్సుని, ఆనందంని కోరుకుంటూ విఘ్నాధిపతి అయిన గణేష్ కి పూజలు చేస్తారు. ఆలయ శిఖరం పై ఆ రోజున కొత్త జాతీయ జెండాను కూడా ఎగురవేస్తామని చెప్పారు.
Also Read: ఇండియా మ్యాప్ లో చైనా, పాకిస్థాన్ ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది..? ఇంత పెద్ద రీజన్ ఉందా..?