స్టార్స్ కి తమ వాయిస్ ఇచ్చిన 11 పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్టుల గురించి తెలుసా?

Ads

సినిమాలలో నటించే యాక్టర్స్ నటన ఎంతగా ఆకట్టుకుంటుందో, వారి వాయిస్ కూడా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. వాళ్ళని నటన ఎలా గుర్తుంచుకునేలా ఉంటుందో. అలాగే వారి వాయిస్ కూడా గుర్తుండిపోతుంది. అయితే తెర మీద నటించే నటినటులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళకు డబ్బింగ్ చెప్పేవారు కనిపించరు.

Ads

చాలా వరకు ఆడియెన్స్ కి వారి పేర్లు కూడా తెలియవు. సొంత భాషలో నటించేవారిలో కొందరు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటారు. అయితే ఇతర భాషల నుండి వచ్చే చాలామందికి వేరే వాళ్ళే డబ్బింగ్ తప్పనిసరి. అలా తమ వాయిస్ ను అరువు ఇచ్చే డబ్బింగ్‍ ఆర్టిస్టులు కొన్ని చిత్రాలతో పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయిన డబ్బింగ్‍ ఆర్టిస్టులు ఎవరో చూద్దాం..సరిత:
కమలహాసన్ నటించిన మరోచరిత్ర ద్వారా సరిత ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అనంతరం కొద్ది కాలంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది. ఆమె అప్పటి నుండి ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఆమె డబ్బింగ్ చెప్పిన వారిలో విజయశాంతి, సౌందర్య, నగ్మ వంటి హీరోయిన్స్ ఉన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం:
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా కమల హాసన్ కి డబ్బింగ్ చెప్పేవారు. ఇక దశావతరంలో సినిమాలో 10 క్యారెక్టర్స్ లో ఏడింటికి ఆయనే డబ్బింగ్ చెప్పారు.
మనో:
సింగర్ మనో సూపర్ స్టార్ రజినికాంత్ కి తెలుగు చిత్రాలకు డబ్బింగ్ చెప్తారు. రజినికాంత్ చెప్పే పంచ్ డైలాగ్ లను ఆయన తప్ప ఇంకో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేరు. ఆయన కొన్నిసార్లు కమల్ హాసన్ కి డబ్బింగ్ చెప్తారు.
ఎస్పీ శైలజ:
సింగర్ ఎస్పి శైలజ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె నిన్నే పెళ్లాడతా సినిమాలో టబుకి, మురారి మూవీలో సోనాలికి డబ్బింగ్ చెప్పింది. శ్రీదేవి, సంఘవి లాంటి చాలామంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.
సాయికుమార్:
ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ ల గురించి మాట్లాడినపుడు సాయి కుమార్ గురించి చెప్పకుండా పూర్తి చేయలేము. ఆయన నటుడిగా అందరికి తెలుసు. అలాగే ఆయన వాయిస్ కూడా పరిచయమే. సాయి కుమార్ ఎక్కువగా సుమన్, రాజశేఖర్ లకి డబ్బింగ్ చెప్తుంటారు.
రవిశంకర్:
సాయికుమార్ రవిశంకర్. ఈ అన్నదమ్ములిద్దరూ యాక్టింగ్ తో పాటు డబ్బింగ్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్, నాజర్, సోనూ సూద్ వంటి చాలామందికి డబ్బింగ్ చెప్పారు. అరుందతి చిత్రంలో పశుపతి పాత్రకి చెప్పిన డబ్బింగ్ రవిశంకర్ కి మంచి పేరు తెచ్చింది.
సునీత:
సింగర్ సునీత పాటలతో మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తుంది. త్రిష, సదా, కమలిని ముఖర్జీ, మీరాజాస్మిన్ వంటి హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది నంది అవార్డులను పొందింది.
హేమచంద్ర:
సింగర్ హేమచంద్ర డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇటీవల పాడటంతో పాటుగా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. ధృవ మూవీలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పాడు.చిన్మయి శ్రీపాద:
సింగార్ చిన్మయి పాటలతోనే కాకుండా, తన వాయిస్ తో కూడా మాయ చేసింది. సమంత చిత్రాల్లో చాలా వాటికి ఆమె డబ్బింగ్ చెప్పింది.రోజారమణి:
నటి రోజారమణి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, నటిగా చేసి, ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. ఆమె చాలామంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. రాధ, సుహాసిని, రాధిక, భానుప్రియ లాంటి ఎందరికో డబ్బింగ్ చెప్పారు.
సవిత రెడ్డి:
సవిత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా త్రిష, జెనిలియా, వంటి చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది. బొమ్మరిల్లు సినిమా లో హాసిని, ఖుషిలో మధు పాత్రలకి ఆమె చెప్పిన డబ్బింగ్ తో మంచి పాపులారిటి పొందింది.
Also Read: తెలుగు ఇండస్ట్రీ లో విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే..!

Previous articleఅక్కడ జనవరి 29న రిపబ్లిక్ డే.. ఎందుకు అలా జరుపుకుంటున్నారో తెలుసా?
Next articleపూర్వ కాలంలో రాజులు కోట క‌ట్టేట‌ప్పుడు ఈ 5 టెక్నిక్స్ ఉపయోగించేవారు.. అవి ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.