హీరో రిషబ్ శెట్టి భార్య కాంతార సినిమా కోసం ఏం చేసిందో తెలుసా?

Ads

రిషబ్ శెట్టి పేరు కాంతార చిత్రం విజయంతో దేశవ్యాప్తంగా మారు మ్రోగిందనే విషయం అందరికి తెలిసిందే. రిషబ్ శెట్టి తన టాలెంట్ తో ఆడియెన్స్ ని మెప్పించడంతో పాటుగా తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ ను సాధించారు. ఈ చిత్ర బడ్జెట్ తో పోలిస్తే ఈ మూవీకి 20 రెట్లు అధికంగా వసూళ్లను రాబట్టిన సంగతి కూడా తెలిసిందే.

Ads

అయితే తాజాగా రిషబ్ శెట్టి తన విజయం వెనుక తన భార్య ఉన్నారని చెప్పడం విశేషం. ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉంటుందని పెద్దల మాట. అలాగే రిషబ్ శెట్టి విజయం వెనుక కూడా ఆయన భార్య ప్రగతి ఉన్నారని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. ఇటీవల రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ ను తీసుకున్న సందర్భంగా ఆయన సామాజిక మధ్యమం వేదికగా తన ఆనందాన్ని అభిమనులతో పంచుకున్నారు. ఈ అవార్డ్ రావడంలో కాంతార చిత్రానికి పని చేసిన అందరు, ప్రధానంగా తన సతీమణి ప్రగతి కారణమని రిషబ్ శెట్టి తెలిపారు.
తనకు వచ్చిన మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును దైవ నర్తకులకు, కర్ణాటక ప్రజలకు మరియు దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి, అలాగే దివంగత దర్శకుడు భగవాన్ కి కూడా అంకితం చేస్తున్నానని రిషబ్ శెట్టి తెలిపారు. అయితే హీరో రిషబ్ ప్రేమ కథ గురించి ఎక్కువ మందికి తెలియదు.రిక్కీ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో తన స్నేహితులకి రిక్కీ మూవీ డైరెక్టర్ ఇతనే అంటూ ప్రగతి పరిచయం చేసింది. అనంతరం రిషబ్ శెట్టికి ప్రగతిది కూడా తన ఊరే అని తెలిసింది. ఇక అప్పటికే రిషబ్ శెట్టి, ప్రగతి ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం కొంతకాలం తరువాత ప్రేమగా మారి 2017 లో రిషబ్, ప్రగతిల వివాహం జరిగింది. ఆ తరువాత ప్రగతి ఒక వైపు క్యాస్టూమ్ డిజైనర్ గా మరో వైపు నటిగా కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. ప్రగతి ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. ఆమె కాంతార చిత్రానికి పని చేశారు. ఇక ఈ సినిమా చిత్రీకరించే టైమ్ లో ప్రగతి గర్భవతి అయినప్పటికి, కాంతార చిత్రం పై ఉన్నటువంటి నమ్మకంతో ప్రగతి ఈ సినిమాకి పని చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్‌ హీరోయిన్ ‘ముంతాజ్’ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Previous articleఅలేఖ్య రెడ్డి తన పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయం గురించి సోషల్ ఆక్టివిస్ట్ కృష్ణ కుమారి..
Next articleసచిన్ డైరీలో రాసుకున్న గొప్ప క్రికెటర్ విషాద గాధ..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.