అలేఖ్య రెడ్డి తన పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయం గురించి సోషల్ ఆక్టివిస్ట్ కృష్ణ కుమారి..

Ads

నందమూరి తారకరత్న ఊహించని విధంగా మరణించడంతో ఆయన ఫ్యామిలిని విషాదం కమ్మేసింది. నలభై ఏళ్లకే తారకరత్న గుండెపోటుతో కన్నుమూసి కుటుంబాన్ని శోక సంద్రంలో వదిలి వెళ్లారు. తారకరత్న ఇండస్ట్రీలో అంతగా రానించలేకపోయిన ఆయనకు మంచి వాగ్దాటి ఉంది. దాంతో టీడీపీలో వచ్చే ఎలెక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు.

కానీ ఆయన ఒకటి అనుకుంటే దైవం మరొకటి అనుకున్నట్లుగా తారకరత్న చిన్న వయసులోనే శాశ్వతంగా అందరిని వదిలి వెళ్ళిపోయాడు. తన ప్రేమ పెళ్ళితో దూరమైన నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుస్తున్నారు. అనుకునే లోపే తారకరత్న శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఈ బాధను తట్టుకోలేకపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి అండగా తారకరత్న కుటుంబం నిలబడుతుందా? లేదా అనే చర్చలు జరుగుతున్న నేపద్యంలో సోషల్ ఆక్టివిస్ట్ అయిన కృష్ణ కుమారి ఈ విషయాల పై మాట్లాడారు.
తారకరత్న పుట్టిన రోజునే ఆయన చిన కర్మ జరగడంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తారకరత్నను తలచుకుని ఎంతగానో బాధపడ్డారు.ఇక అలేఖ్య రెడ్డి జీవితంలో ముందుగా విడాకులు అవడం, ఇప్పుడు ఇలా భర్త మరణించడంతో ఆమె కోలుకోలేని బాధలో ఉంది. కృష్ణ కుమారి మాట్లాడుతూ అలేఖ్య రెడ్డి పేరెంట్స్, తారకరత్న పేరెంట్స్ ఇద్దరూ కూడా పెద్ధ ఫ్యామిలికి చెందిన వారు అవ్వడంతో ఆర్ధికంగా వచ్చే ఎలాంటి ఇబ్బందులైనా వారే చూసుకుంటారు.

Ads

కానీ భర్త లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేరని, అలాగే ఆ పిల్లలకు కూడా తండ్రి లేనటువంటి లోటును పూడ్చలేరని అన్నారు. ఇక అలేఖ్య రెడ్డి ఎంతో దురదృష్టవంతురాలు అని అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఒక ఫ్యామిలిలో భర్త పోయినప్పటికి కూడా ఆ ఇంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక భార్య అన్ని చూసుకోగలదు. కానీ ఆ ఇంటి భార్య మరణిస్తే మాత్రం అప్పుడు ఏర్పడే లోటు ఎవరు కూడా పూడ్చలేరు. అసలు మంచి పేరు ఉన్న పెద్ద ఫ్యామిలిలో కష్టం వచ్చిందని ఇలా అందరు చర్చించుకోవడం సమంజసం కాదని అన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్‌, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?

Previous articleతారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తండ్రి మరియు ఫ్యామిలీ గురించి తెలుసా?
Next articleహీరో రిషబ్ శెట్టి భార్య కాంతార సినిమా కోసం ఏం చేసిందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.