సైలెంట్ గా OTT లోకి వచ్చి సెన్సేషన్ అయ్యింది ఈ సినిమా…ట్విస్టులు మాములుగా లేవుగా.?

Ads

ఈమధ్య థియేటర్లో కన్నా ఓటీటీలకే ఎక్కువగా లాభాలు వస్తున్నాయి. ఏ సినిమా అయినా థియేటర్ల తర్వాత వెంటనే ఓటీటీ లోకి దించేస్తున్నారు. కొన్ని సినిమాలను అయితే డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేస్తున్నారు. ఎన్ని సినిమాలు విడుదల చేసినా డిజిటల్ ప్లాట్ఫామ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. కుటుంబ సభ్యులందరూ ఓటిటీ లకు అతుక్కుపోయారు. అందులోనూ క్రైమ్ త్రిల్లర్స్ అంటే మంచి డిమాండ్ పెరిగిపోయింది.

క్రైమ్ థ్రిల్లర్స్ థియేటర్లో విడుదల చేసిన అతి తక్కువ రోజుల్లోనే ఓటిటి ప్లాట్ఫామ్ లకు అమ్మేస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే వేరే లాంగ్వేజ్ నుంచి డబ్బింగ్ చేసి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోకి దింపుతున్నారు. ఇంగ్లీష్ సినిమాలు, మిగిలిన భాష సినిమాలు కూడా తెలుగు డబ్బింగ్ లో చాలా ఫేమస్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా కిందటి సంవత్సరం నవంబర్ 3న విడుదలైన విధి అనే థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది.

Ads

ఇది ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుంది. అసలు కథ ఏంటంటే అమాయకంగా ఉండే హీరో ఉద్యోగం కోసం ఊరు నుంచి సిటీకి వస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఉన్న పెన్ మీద హీరో ఆసక్తి చూపుతాడు. ఆ పెన్ ధర నలభయ్ వేలు అని తెలిసి ఆశ్చర్యపోతాడు. తర్వాత హీరోకి అలాంటి ఒక పెన్నే దొరుకుతుంది కానీ విశేషం ఏంటంటే ఆ పెన్ తో రాసిన ప్రతి ఒక్కరూ చావుకు గురవుతున్నారు.

ఈ మిస్టరీస్ లను హీరో ఎలా తెలుసుకోబోతున్నాడు. అసలు కాదేంటి అన్నది సినిమాలో చూడవలసి ఉంది. విడుదలైన రెండు మూడు వారాలకి ఓటీటీలో కి దింపేస్తున్న ఈ కాలంలో మూడు నెలల తర్వాత సైలెంట్ గా ఈ సినిమాని దింపడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఈ సినిమా వ్యూయర్కూ షిప్ కూడా బానే ఉంది. అందరూ చూసి మంచి రివ్యూ ఇస్తున్నారు.

Previous articleOTT లోకి సడన్ గా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా..? ఎలా ఉందంటే..?
Next articleపెళ్లి అయ్యాక కూడా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తారు.. 5 కారణాలు ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.