OTT లోకి సడన్ గా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చూశారా..? ఎలా ఉందంటే..?

Ads

ఓటీటీలోకి రోజుకి ఒక సినిమా విడుదల అవుతూ ఉంటుంది. వేరే భాషల సినిమాలు అయినా కూడా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా ఇప్పుడు ఒక తమిళ సినిమా తెలుగులో విడుదల అయ్యింది. ఆ సినిమా పేరు రెజీనా.

ఇది గత సంవత్సరం జూన్ 23వ తేదీ థియేటర్లలో రిలీజ్ అయ్యి, హిట్ టాక్ పొందలేకపోయింది. ముందు ఈ సినిమాని తమిళ్ తో పాటు, తెలుగు, కన్నడ, మలయాళం, భాషల్లో కూడా విడుదల చేద్దాం అని అనుకున్నారు. కానీ స్క్రీన్స్ దొరకకపోవడంతో కేవలం తమిళ్ లో మాత్రమే విడుదల చేశారు. రెజీనా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడో రిలీజ్ అయ్యింది.

new suspense thriller movie on ott

Ads

ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. సునైనా ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. కథ విషయానికి వస్తే, భర్త మరణించడంతో ఒక మహిళ అతనిని చంపిన వారి మీద ఎలాంటి పగ తీర్చుకుంది అనేది సినిమా కథ. ఇదే విషయం మీద సినిమా అంతా కూడా నడుస్తుంది. అనంత్ నాగ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. పర్ఫార్మెన్స్ పరంగా సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ పాత్ర పోషించిన సునైనా అయితే సినిమా కోసం తన ప్రాణం పెట్టారు.

new suspense thriller movie on ott

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. కానీ కంటెంట్ పరంగా మాత్రం సినిమా బలహీనంగా ఉంది. ఈ కారణంగానే తమిళ్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. కుటుంబంతో కలిసి చూసే సినిమానే. ఇబ్బంది కలిగించే సీన్స్ లేవు. సరదాగా ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకునేవారు ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమా చూస్తే ఒక్కసారి చూడగలిగే సినిమాగా ఇది నిలుస్తుంది.

Previous article2 భాషల్లో రీమేక్ చేసి ఈ సినిమాని చెడగొట్టారు..! ఈ కల్ట్ క్లాసిక్ గురించి తెలుసా..?
Next articleసైలెంట్ గా OTT లోకి వచ్చి సెన్సేషన్ అయ్యింది ఈ సినిమా…ట్విస్టులు మాములుగా లేవుగా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.