ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అందరి ముందు అలా అనడంతో..? నేను చేసింది సరైనదేనా..?

Ads

ప్రేమ. మనిషి జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది అని అంటారు. ఈ ప్రేమ అనే ఒక్క విషయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఫలితం కూడా ఉండదు. జీవితం మొత్తాన్ని తలకిందులు చేస్తుంది. కొన్ని సార్లు అనుకున్న ప్రేమ దొరికినా కూడా సంతృప్తి ఉండదు. అది ప్రేమ కాదు అని తర్వాత తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రేమ కంటే మర్యాద చాలా ముఖ్యం అని అర్థం అవుతుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నా పేరు వినయ్. స్వాతి నా జూనియర్. కాలేజ్ సమయంలో క్యాంపస్ లో కనిపించేది. తర్వాత మా ఇంటి దగ్గరే ఉంటుంది అనే విషయం తెలిసింది.

సేమ్ లొకేషన్ కావడంతో మా బస్సులు కూడా ఒకటే. మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాను. తర్వాత ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నాం. రోజు చాటింగ్ చేసుకునే వాళ్ళం. చాలా సరదాగా మాట్లాడేది. చాలా బాగా జోక్స్ వేసేది. తన స్నేహితుల గురించి చెప్తూ కామెడీ చేసేది. నేను చాలా నవ్వుకునే వాడిని. తనతో మాట్లాడే ఆ గంట సేపు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కాలేజ్ అయిపోయాక కలవడం మొదలుపెట్టాం. తర్వాత మాది ప్రేమ అని అర్థం అయ్యింది. ఇద్దరం ఒకరికి ఒకరు నచ్చడంతో, తనకి నేను ఇంకా బాగా నచ్చడంతో నా ప్రేమని తను అంగీకరించింది.

ఇద్దరం ఉద్యోగాల్లో చేరాం. కొన్నాళ్లు జీవితం ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఇళ్లల్లో మా విషయం చెప్పేసాం. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. సాధారణంగా సినిమాల్లో ప్రేమ కథలు అంటే గొడవలు అవుతూ ఉంటాయి. కానీ మా విషయంలో అలా ఏం జరగలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి అని ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి రెండు నెలలు ఉంది అన్నప్పుడు నా ఆఫీసులో గొడవలు రావడం మొదలు అయ్యాయి. ఇంకా అక్కడ వర్కౌట్ అవ్వదు అని అర్థం అయ్యి జాబ్ మానేశాను. ఇదే విషయం స్వాతికి చెప్పాను. “ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం వెతుక్కో” అని చెప్పింది. “నేను ఉద్యోగం చేస్తాను” అని చెప్పింది. స్వాతి అలా అనడంతో నాకు ధైర్యం వచ్చింది. తర్వాత మా ఎంగేజ్మెంట్ జరిగింది.

ఎంగేజ్మెంట్ కి, పెళ్ళికి మధ్యలో ఆరు నెలల వ్యవధి ఉంది. మూడు నెలలు గడిచిపోయాయి. జాబ్ కోసం నేను తిరగని ఆఫీస్ లేదు. కానీ జాబ్ రాలేదు. కానీ పెళ్లికి ముందు నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాను అని చెప్పాను. స్వాతి కూడా తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాను అని చెప్పింది. నాకు ఉద్యోగం లేకపోతే వాళ్లని బాధ పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి మా ఇద్దరి స్నేహితులని పిలిచి ఒకటే చోట పార్టీ ఇవ్వాలి అని అనుకున్నాం. డిన్నర్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ లో ఒకడు, “స్వాతి ఆఫీస్ కి వెళ్తే నువ్వు ఇంట్లో వంట చేస్తూ కూర్చుంటావా?” అని సరదాగా అన్నాడు. నేను కూడా నవ్వి ఊరుకున్నా.

Ads

why men are not preferring to marriage

ఇంకొక ఫ్రెండ్ కూడా, “అవును రా. నువ్వు ఇంకా జాబ్ వెతుక్కోవడం మానేయ్. హాయిగా ఇంట్లో పని చేస్తూ కూర్చో. నీకు అదే కరెక్ట్” అని అన్నాడు. ఈ మాట నాకు నచ్చలేదు. కానీ వాళ్ళని నేను ఆహ్వానించాను కాబట్టి, వాళ్లు అతిధులు కాబట్టి నేను ఏమీ అనలేకపోయాను. కానీ స్వాతి నాకు సపోర్ట్ ఇస్తుంది అనుకున్నాను. “ఇంట్లో ఉంటే తప్పేంటి?” అని అంటుంది అనుకున్నాను. కానీ తను అలా అనలేదు. “అవును వాడికి అదే కరెక్ట్. జాబ్ చేయడం వాడి వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ చేసినా కూడా నెలరోజుల కంటే ఎక్కువ చేయలేడు” అని చెప్పి నవ్వింది. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది.

నా మీద, నేను ప్రేమించిన అమ్మాయి జోక్ చేస్తుందా? అది కూడా నేను బాధపడుతున్న విషయం మీద తను జోక్ చేసిందా? అంతకుముందు ఇలాగే తన ఫ్రెండ్స్ గురించి జోక్స్ చేసేది. అప్పుడు నేను ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇతరుల విషయాల మీద జోక్స్ చేసి నవ్వడం స్వాతికి అలవాటు. తర్వాత ఈ విషయం మీద మాట్లాడాను. తను వాళ్ళ ముందు అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పాను. “జోక్ కూడా తీసుకోలేకపోతున్నావు. నువ్వేం మగాడివి?” అని అంది. అంటే? మగవాళ్ళు అయితే జోక్స్ తీసుకోవాలా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అప్పటి నుండి తను చేస్తున్న ఒక్క పని కూడా నాకు నచ్చట్లేదు. తర్వాత నుండి, “మీ ఫ్రెండ్స్ చెప్పింది నిజమే” అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టింది.

ఇంక నా వల్ల కాలేదు. ఒకరోజు ఈ మాటలు మరీ ఎక్కువగా అనడం మొదలు పెట్టింది. దాంతో నా ఆత్మగౌరవం దెబ్బ తిన్నట్టు అనిపించింది. అంతే. నేను బాధపడుతున్న విషయాలు మీద కామెడీ చేసే అమ్మాయి నాకు అవసరమా? పెళ్లికి సరిగ్గా రెండు నెలలు ఉన్నప్పుడు తనతో బ్రేకప్ చెప్పేసాను. ఏడ్చింది. బాగా ఏడ్చింది. కానీ నాకు తనని క్షమించాలి అనిపించలేదు. ఆడవాళ్ళని ఎవరైనా ఒక మగవాడు ఇలాంటి మాట అంటే వారికి మద్దతు ఇవ్వడానికి 100 మంది వస్తారు. కానీ మగవాడు ఇలాంటి మాటలు పడుతూ ఉంటే ఇంకా పడమని చెప్తారు. ఇదెక్కడి న్యాయం. అందుకే నా న్యాయం నేనే ఏర్పరుచుకోవాలి అని అనుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా.

ALSO READ : 30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!

Previous articleపదవ తరగతిలో టాప్ మార్కులు సాధించిన టీడీపీ లీడర్ కూతురు..! ఎన్ని మార్కులు వచ్చాయంటే..?
Next articleకేవలం విజయ్ దేవరకొండ విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది..? నెగిటివిటికి కారణం ఇదే..!