పదవ తరగతిలో టాప్ మార్కులు సాధించిన టీడీపీ లీడర్ కూతురు..! ఎన్ని మార్కులు వచ్చాయంటే..?

Ads

నిన్న ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు విడుదల చేశారు. 100 మందిలో 85 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వారిలో కొంత మందికి మంచి మార్కులు వచ్చాయి. ఆకుల వెంకట నాగసాయి మనస్వి 600 మార్కులకు 599 మార్కులు తెచ్చుకుంది. ఈ అమ్మాయి మాత్రమే కాకుండా, తెలుగు దేశం పార్టీ నాయకుడి కూతురు కూడా పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకుంది.

sai shravya tdp leader daughter ap ssc result

తిరుపతి జిల్లా కోడూరుకి చెందిన పంతగాని నరసింహ ప్రసాద్ కూతురు సాయి శ్రావ్య, 600 కి 584 మార్కులు సంపాదించింది. సాయి శ్రావ్య స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్‌లో చదివింది. నరసింహ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సాయి శ్రావ్యకి మంచి మార్కులు రావడంతో పలువురు రాజకీయ నాయకులు కూడా అభినందించారు. ఇంక నిన్న విడుదల అయిన పదవ తరగతి ఫలితాల్లో 86.69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

sai shravya tdp leader daughter ap ssc result

మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇందులో కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. గత చాలా సంవత్సరాల నుండి కూడా పదవ తరగతి ఫలితాల్లో బాలికలు అత్యధిక మార్కులు సంపాదిస్తున్నారు. టాపర్ జాబితాలో కూడా ఎక్కువ మంది బాలికలే ఉంటున్నారు. ఈసారి కూడా అలాగే బాలికలు ఎక్కువ మార్కులు సాధించారు. ఉత్తీర్ణత శాతం కూడా బాలికల్లోనే ఎక్కువగా ఉంది. ఈసారి 100 కు 89 మంది బాలికలు పాస్ అయ్యారు.

Ads

ఎంతో మంది టాప్ మార్కులు సంపాదించుకున్నారు. అబ్బాయిల్లో వందకి 84 మంది పాస్ అయ్యారు. అబ్బాయిల్లో కూడా ఈసారి ఉత్తీర్ణత శాతం బాగానే వచ్చింది. వీళ్లలో కూడా ఎంతో మంది టాప్ మార్కులు సంపాదించి ఆ జాబితాలో నిలిచారు. నిన్న, అంటే సోమవారం 11 గంటలకి ఈ ఫలితాలను విడుదల చేశారు. టాప్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండే ప్రముఖులు అభినందనలు తెలిపి, వారు సాధించిన విజయానికి ప్రశంసిస్తున్నారు. వారు ఇంకా బాగా చదవాలి అంటూ ప్రోత్సహిస్తున్నారు.

ALSO READ : 30 ఏళ్ల క్రితమే.. చిరంజీవి సినిమా టిక్కెట్ ధర ఎంత రేంజ్ కి వెళ్లిందో తెలుసా..? వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్..!

Previous articleఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఒక హీరో ఉన్నాడు..! ఎవరో కనిపెట్టగలరా..?
Next articleప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అందరి ముందు అలా అనడంతో..? నేను చేసింది సరైనదేనా..?