Ads
నటి సాయి పల్లవి గురించి సౌత్ ఇండియా అంతటా తెలిసిన విషయమే. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలలో తన నటనతో అందరి మనసులని గెలుచుకుంది ఈ భామ. అందరూ హీరోయిన్లకి విభిన్నంగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సాయి పల్లవి. తెలుగు పరిశ్రమలో ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి నాగచైతన్యతో తండేల్ అనే చిత్రంలో నటించనుంది.
మరోవైపు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటించనుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కెరీర్ లో దూసుకు వెళ్తున్న సాయి పల్లవి పెళ్లెప్పుడు అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో తన చెల్లి అయిన పూజా కన్నన్ తన పెళ్లి అనౌన్స్మెంట్ ని ఇచ్చింది. సాయి పల్లవి, తన చెల్లి పూజ ఇద్దరూ సుమారు ఒకేలా ఉంటారు.
Ads
ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న పూజ అక్కడ వీడియోస్ ని, ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన చీర ఎంతో సింపుల్ గా అట్రాక్టివ్ గా ఉంది. ఆ చీర ధర ఏకంగా 50,000 అంట. ఈ చీరలో సాయి పల్లవి తన చెల్లెలు పూజ ఎంగేజ్మెంట్ ని జరుపుకుంది. అక్కడ డాన్సులు వేస్తూ, ఫోటోలు తీస్తూ, తన చెల్లిని రెడీ చేస్తూ ఫంక్షన్ అంతా హడావిడి చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూజ తన ఫియాన్సీ తో హ్యాపీ మూమెంట్స్ ని ఫోటోలు వీడియోలు ద్వారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దాని కింద సాయి పల్లవి ఫాన్స్ అందరు చెల్లెలు కన్నా అక్కే బాగుంది అని కామెంట్లు పెడుతూ సాయి పల్లవి ని పొగుడుతున్నారు. ఇప్పుడే ఇంత ఖర్చుపెట్టి తయారయిందంటే పెళ్లికి ఇంకెంత ఘనంగా ఉండబోతుందో సాయిపల్లవి అని అభిమానులు అందరూ పూజ పెళ్లి సెలబ్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.