కాళోజీ నారాయణరావు గొప్పదనం ఏంటి..? ఆయన అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ఎందుకు ఇంత అభిమానం..?

Ads

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పుట్టినరోజును తెలంగాణ ప్రభుత్వం గౌరవించి, సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా తెలంగాణకు  ఆయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ప్రకటన చేశారు.

అప్పటి నుండి ప్రతి ఏడాది సెప్టెంబరు 9న ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. కాళోజీ నారాయణరావు గొప్పదనం ఏమిటో? ఆయన అంటే ఇప్పటికి కూడా ప్రజలకి ఎందుకు ఇంతగా అభిమానిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఆయన 1914లో సెప్టెంబరు 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా, రట్టిహళ్లిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రమాబాయమ్మ, కన్నడ ఆడపడుచు. ఆయన తండ్రి పేరు కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కాళోజీ కుటుంబం బీజాపూర్ నుండి వరంగల్ జిల్లాకు వచ్చి, మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యను మడికొండలో, ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు.
1939లో న్యాయ విద్యను చదివారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఉద్యమాల పట్ల ఆకర్శితులైన కాళోజీ ఆర్య సమాజ్‌, పౌర హక్కుల సాధన లాంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమంలోముఖ్యపాత్రను పోషించారు. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని చేసిన కాళోజీ పలు మార్లు జైలుకు వెళ్లారు. కాళోజీ రచనలలో తెలంగాణ ప్రజల ఆవేదన, ఆర్తి, ఆగ్రహం కనిపిస్తాయి.
కాళోజీ నారాయణరావు తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ, ఇంగ్లీషు భాషలలో రైటర్ గా ప్రసిద్ధి చెందారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో ఆయన దిట్ట. ‘నా గొడవ’ పేరుతో సామాజిక సమస్యల పై  నిక్కచ్చిగా, కటువుగా, నిర్మొహమాటంగా పాలకుల గురించి రాసి, ప్రజాకవిగా పేరు గాంచాడు. “మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతున్నది” అంటూ తెలంగాణ భాషను, తెలంగాణ యాసలోని కమ్మదనాన్ని లోకానికి చాటి చెప్పిన ప్రజాకవి.

Ads

Also Read: సీనియర్ ఎన్టీఆర్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి తెలుసా?

Previous article”ఈతరంలో కోడళ్ళు ఇంటి పనులు చేసేందుకు ఎందుకు ఇష్టపడట్లేదు”..? ఈ ప్రశ్నకు ఒక అమ్మాయి చెప్పిన జవాబు ఏంటంటే…?
Next articleచెల్లి పెళ్లిలో “సాయి పల్లవి” ధరించిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.