Ads
1983 జూన్ 25న క్రికెట్ రూపురేఖలు మారడానికి బీజం పడింది. 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకుంది. అలాగే చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ జాతికి గర్వకారణంగా నిలిచింది. అలా 1938 లో సాధించిన ఆ విజయానికి నేటితో 38 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం అంటే క్రికెట్ ఆటగాళ్లు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు కానీ అప్పట్లో ఆటగాళ్ళ రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.భారత జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకుంటే ఇక తిరుగులేదు.
క్రికెట్ పూర్తి కమర్షియల్ క్రీడగా మారిపోయాక ఆటగాళ్ల సంపాదన కళ్లు చెదిరే రీతిలో ఉంటోంది. మ్యాచ్ ఫీజ్, ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ఇలా ఒక్కో ఆటగాడు కోట్లలో సంపాదిస్తున్నాడు. ఆటగాళ్లను వారి ప్రదర్శన ఆధారంగా ఎ+, ఎ, బి, సి కేటగిరీలుగా విడదీసి బీసీసీఐ వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఎ+ లో స్థానం సంపాదించిన ఆటగాడి వార్షిక ఆదాయం దాదాపుగా ఏడు కోట్లు. ఎ లో ఉంటే 5 కోట్లు, బిలో ఉంటే 3 కోట్లు ఇక సి అయితే కోటి రూపాయల చొప్పున సంవత్సరానికి చెల్లిస్తోంది. మ్యాచ్ ఫీజ్ కాకుండా ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ద్వారా వచ్చే సంపాదన అదనంగా కూడా వస్తూ ఉంటుంది. కాగా 1983లో ప్రపంచకప్ గెలిచి భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ తీసుకొచ్చిన కపిల్ జట్టు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
Ads
ప‌్రస్తుత ఆటగాళ్ల సంపాదనతో పోల్చి చూసుకుంటే కొన్ని వేల రెట్లు తక్కువ. 1983 సెప్టెంబర్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన వన్డే ఎగ్జిబిషన్ మ్యాచ్ టీమ్ షీట్‌ను స్పోర్ట్స్ జర్నలిస్ట్ మక్రంద్ బయటపెట్టారు. అప్పట్లో ఇలా వేర్వేరు విభాగాల్లో ఆటగాళ్లను చేర్చి మ్యాచ్ ఫీజు చెల్లించే పద్ధతి లేదు మేనేజర్‌తో సహా ఆటగాళ్లందరికీ ఒకటే ఫీజు. ప్రపంచకప్ విజయం తర్వాత పాకిస్థాతో వన్డే మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఒక్కొక్కరు మ్యాచ్ ఫీజుగా రూ.1500, డైలీ అలవెన్స్ కింద మూడు రోజులకు 600 అలా మొత్తం రూ.2100 అందుకున్నారు. వినడానికి షాకింగ్ గా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
ప్రస్తుతం సి గ్రేడ్‌లో ఉన్న ఆటగాడు ఒక్క వన్డే మ్యాచ్‌కు అందుకుంటున్నది అక్షరాలా ఆరు లక్షల రూపాయలు. దాంతో పోల్చుకుంటే ఎంతో తక్కువ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం రోజులు మారిపోయాయ్. ఆ వరల్డ్ కప్ విజయం భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. క్రికెట్ ఒక మతంలా తయారైంది. క్రికెటర్లను ఆరాధ్య హీరోలుగా భావిస్తుంటారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్, ధోనీ లాంటి క్రికెటర్ల సంపాదన తెలిస్తే కళ్లు తేలయడమే. సంవత్సరానికి ఈ క్రికెటర్లు వందల కోట్ల సంపాందిస్తున్నారు.