Ads
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆసియాలో అత్యంత సంపన్నులలో రెండో వ్యక్తిగా, ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ. దేశంలోనే విలువైన కంపెనీలలో రిలయన్స్ సంస్థ ముందువరుసలో ఉంటుంది.
Ads
ముఖేష్ అంబానీ వ్యక్తి ఇంట్లో పని చేసేవారికి జీతాలు, జీవితాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ ఇళ్లలో ఒకటి అయిన ఆంటిలియాలో ముకేష్ అంబానీ, నివసిస్తున్నారు. ముంబైలోని 27 అంతస్తులు ఉండే ఆంటిలియాలో దాదాపు 600 మంది దాకా పని చేస్తారంట. ఈ విలాసవంతమైన భవనంలో పనివారి వేతనాలు ఏ రేంజ్ లో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. అంబానీ ఇంట్లో పనివారికి జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారట. ముఖ్యంగా ముఖేష్ అంబానీ కార్ డ్రైవర్ కి వేతనం ఎంత జీతం ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ళలో ముఖేష్ అంబానీ ఇల్లు టాప్ ప్లేస్ లో ఉంది. ఈ ఇంటిని దక్షిణ ముంబైలో 4 లక్షల చదరపు అడుగులలో నిర్మించారు. ఈ ఇంటి ఖరీదు సుమారు పదకొండు వేల కోట్లు అని అంచనా. ఈ 27 అంతస్తుల ఇంటిలో 600 మంది దాకా పనివాళ్ళు ఉంటారట. ఇక ముఖేష్ అంబానీ పర్సనల్ కారు డ్రైవర్ వేతనం నెలకు దాదాపు రెండు 2 లక్షల రూపాయలంట. జీతంతో పాటుగా పాటు ఎలివెన్స్ కూడా అదనంగా ఇస్తారట. అంటే అంబానీ కార్ డ్రైవర్ కి సాధారణంగా కార్పొరేట్ జనరల్ మేనేజర్ కి ఇచ్చే వేతనంతో సమానంగా ఇస్తారు.
ఇక అంబానీ ఇంట్లో పనిచేసే వంట మనుషుల వేతనం నెలకు 2 – 3 లక్షల దాకా ఉంటుందట. మిగిలిన బ్యూటీషియన్లు, అసిస్టెంట్లు, హోమ్ క్లీనర్లు, టెక్నికల్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళకు ఇలా 6 వందల మందిలో దాదాపు 200 నుంచి 300 మందికి లక్ష నుండి 2 లక్షల వరకు వేతనాలు ఇస్తారంట. అయితే ఇంత పెద్ద భవనంలో ఇంత మంది పనివారు ఉన్నప్పటికి ఆ ఇంట్లో ఉండేది ఐదుగురే. Also Read: వీసా లేకుండా ఈ 10 కంట్రీస్ కి వెళ్లొచ్చు.. మరి ఆ దేశాలు ఏమిటో తెలుసా?