వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ఈ “లక్కీ గర్ల్” కి ఏమైంది.? ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదంట.?

Ads

సంయుక్త మీనన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో లక్కీ గర్ల్‌ అనే పేరుని సొంతం చేసుకుంది. వరుస సినిమాలలో నటించిన సంయుక్త, ఆ చిత్రాలు హిట్ అవడంతో లక్కీ గర్ల్‌ గా మారిపోయింది.

అందం, అభినయం ఉన్న సంయుక్త మీనన్‌ మూడు హిట్ సినిమాల తరువాత సడన్‌గా స్లో అయ్యారు. డెవిల్ మూవీలో నటించిన సంయుక్త చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదని సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సంయుక్త మీనన్ మలయాళం మూవీ ‘పాప్‌కార్న్’తో 2016లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.  ‘కలరి’ మూవీతో 2018లో కోలీవుడ్ కి పరిచయమైన సంయుక్త, టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మూవీతో అడుగుపెట్టింది. అయితే భీమ్లా నాయక్ మూవీ ఆమె తొలి సినిమాగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత రిలీజ్ అయిన బింబిసార బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ధనుష్ తో నటించిన సార్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత సాయిధ‌ర‌మ్ తేజ్‌ తో నటించిన విరూపాక్ష కూడా విజయం సాధించింది. ఈ మూవీలో సంయుక్త మీనన్‌ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి, ఆకట్టుకుంది. హ్యాట్రిక్ హిట్స్ లో నటించిన ఆమె తెలుగులో లక్కీ గర్ల్‌ గా మారింది. హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, త్వరలో రిలీజ్ కానుంది.
సంయుక్త నెక్స్ట్ చేయబోయే మూవీ విషయం గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క మూవీ కూడా లేనట్టు తెలుస్తోంది. దానికి కారణం స్టార్ హీరోల చిత్రాలలో ఆ రేంజ్‌ ఉన్న హీరోయిన్లను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. మీడియం రేంజ్‌ హీరోలు చాలావరకు యంగ్ హీరోయిన్స్ శ్రీలీల, కృతి శెట్టి లను తీసుకోవడంతో సంయుక్తకు అవకాశాలు లేవని టాక్. అంతేకాకుండా ఆమె గ్లామర్ పాత్రలకు అంతగా సెట్ కారని టాక్ ఉండడం వల్ల ఆమెకు ఆఫర్స్ రావట్లేదని తెలుస్తోంది.

Also Read: ఒకప్పుడు “బాలయ్య” సినిమా 40 కోట్లు అంటే గొప్ప…కానీ ఇప్పుడు సడన్ గా మార్కెట్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా.?

Previous articleతెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే రిపోర్ట్…బీజేపీకి పెద్ద షాక్…అన్నే సీట్లు అంట.?
Next articleరాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఉన్న తేడా ఏమిటో తెలుసా..? ఏ ఉప్పు వాడాలంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.