“సరైనోడు”లో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? ఈ తప్పు ఎలా చేసారో.?

Ads

మన స్టైలిష్ స్టార్ బన్నీ సినిమా “సరైనోడు” ఎంత హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. తెలుగు లోనే కాదు.. ఈ సినిమా ను హిందీ లో డబ్ చేసి అదే టైటిల్ తో యు ట్యూబ్ లో పెట్టిన తరువాత కూడా సరైనోడు రికార్డు లు సృష్టించింది. యాభై కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మూడు వారాల్లోనే 101 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా లో కూడా ఓ మిస్టేక్ ఉంది. ఇలాంటి మిస్టేక్ లు కమర్షియల్ సినిమాలలో సర్వ సాధారణం గా ఉంటాయి. అదేంటంటే.. హీరో అల్లు అర్జున్ ఎమ్మెల్యే గా ఉన్న కేథరిన్ ను ప్రేమిస్తాడు. అంత వరకు బాగానే ఉంది.. కానీ సడన్ గా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఫ్లాష్ బ్యాక్ ని చెప్పి అల్లు అర్జున్ ని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. అల్లు అర్జున్ కూడా ఆమెను కాపాడతాడు.

watch video:

Ads

ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు మధ్యలో బ్లాక్ బస్టర్ సాంగ్ వస్తుంది. అసలు అల్లు అర్జున్ ఆ పాటకి స్టెప్పులేసినట్లు రకుల్ ప్రీత్ సింగ్ కి ఎలా తెలుసు? తెలియదు కదా… కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఆమె చెప్తుంది. ఇలాంటి మిస్టేక్ లు జరగడం చాలా కామన్.

బాహుబలి లో కూడా ఇలాంటి మిస్టేక్ జరిగింది. కట్టప్ప జూనియర్ బాహుబలి కి స్టోరీ చెబుతున్నపుడు రానా, అమరేంద్ర బాహుబలి రానా కలిసి మనోహరి పాటకు డాన్స్ చేస్తారు. వాళ్లిద్దరూ డాన్స్ చేసినట్లు స్టోరీ ప్రకారం అయితే కట్టప్ప కు తెలియదు. కానీ కట్టప్ప స్టోరీ ని నేరేట్ చేస్తున్నప్పుడే ఈ పాట కూడా వస్తుంది. ఇవేమి పెద్ద పెద్ద పొరపాట్లు ఏమి కాదు. కాకపొతే సినిమా తీసేటప్పుడు అలా సహజం గా జరిగిపోతుంటాయంతే. కానీ, మనం సినిమా చూసినపుడు మనకి ఇలాంటి డౌట్ లు వస్తూ ఉంటాయి అంతే.

Previous articleతెలివైన వారు..స్త్రీలు మీ మాట వినేలాగా చేయాలంటే… చాణుక్యుడు చెప్పిన ఈ 4 హిప్నోటిజం ట్రిక్స్ ట్రై చేయండి!!
Next article30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.