తెలివైన వారు..స్త్రీలు మీ మాట వినేలాగా చేయాలంటే… చాణుక్యుడు చెప్పిన ఈ 4 హిప్నోటిజం ట్రిక్స్ ట్రై చేయండి!!

Ads

చాణుక్యుడు అర్ధశాస్త్రాన్ని రచించిన వాడిగా అందరికి సుపరిచితుడే. ఆయన భారతీయ బహు శాస్త్రజ్ఞుడు, అతను ఉపాధ్యాయుడు, రచయిత, వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త మరియు రాజ సలహాదారుగా కూడా పని చేసిన వ్యక్తి. ఆయనను కౌటిల్య లేదా విష్ణుగుప్తుడుగా కూడా పిలుస్తూ ఉంటారు.

అర్ధశాస్త్రాన్ని రచించడం వలన ఆయనను భారతదేశంలో రాజకీయ శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్ర రంగానికి మార్గదర్శకుడిగా పరిగణిస్తుంటారు. 321 BCEలో, చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడు అధికారంలోకి రావడానికి సహాయం చేసాడు మరియు మౌర్య సామ్రాజ్య స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు విశేషమైన కీర్తిని పొందారు.

ఆయన చెప్పిన ఎన్నో విషయాలు సదా చిరస్మరణీయాలు. ఆయన చెప్పిన విషయాలు అన్నీ చాణక్యనీతిగా ప్రాచుర్యం పొందాయి. వాటిని మనం నేటికీ, మన జీవితాలకు అన్వయించుకుని ఆచరించుకోవచ్చు. ఇతరులను మన కంట్రోల్ లో ఎలా ఉంచుకోవాలి అన్న విషయమై చాణుక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

అత్యాశ: కొంతమంది డబ్బుని చూసి ఆశపడే వారు ఉంటారు. వీరిని మీ కంట్రోల్ లో ఉంచుకోవడం తేలిక. డబ్బుని ఆశ చూపించి మీ పనులు పూర్తి చేసుకోవచ్చు.

కోపం: కోపాన్ని కలిగిన వ్యక్తులు త్వరగా దాన్ని కంట్రోల్ లో ఉంచుకోలేకపోతారు. కోపిష్టులను మచ్చిక చేసుకోవడం సులభం. కోపిష్టులను భరించడమే అందుకు మార్గం. ఎవరి కోపాన్నీ ఎవరు భరించలేరు. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే ఎవరైతే తమ కోపాన్ని భరించగలుగుతారో వారి కంట్రోల్ లోకి కోపిష్టులు వెళ్లిపోతుంటారు.

మూర్ఖత్వం: మూర్ఖులను మీ మాట వినేలా చేసుకోవడం కష్టమే. కానీ, అసాధ్యం కాదు. వారిని పొగడడమే మంచిది. పొగడ్తల ద్వారానే వారిని మీ దారి లోకి తెచ్చుకుని పని పూర్తి చేసుకోవాలి.

తెలివైన వ్యక్తులు: ఇటువంటి వారిని హిప్నటైజ్ చేయడం కష్టం. ఎందుకంటే వారు ప్రతిదీ సూక్ష్మంగా గ్రహిస్తారు. వారిని మీ మాటలతో మాయ చెయ్యలేరు. వీరిని మీ మాట వినేలా చేసుకోవాలి అంటే.. వారి ముందు నిజం మాట్లాడండి. నిజాయితీగా ఉండండి అని చాణుక్యుడు చెబుతున్నాడు.

Previous article‘హనుమాన్ జంక్షన్’ సినిమా గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియని 14 విషయాలు..
Next articleలోకేష్-బ్రాహ్మణి పెళ్లి ఫొటోలో ఉన్న ఈ యంగ్ హీరో భార్యను గుర్తుపట్టారా.? అప్పుడు ఆమె ఎంత చిన్నగా ఉన్నారో చూడండి.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.