ఇలా దూకేసింది ఏంటి..? అసలు లాజిక్ లేకుండా ఇలాంటి సీన్ ఎలా తీశారు..?

Ads

ఈమధ్య కొన్ని సినిమాల్లో సీన్లు చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాం… సినిమా అంటే లాజిక్ లకు అందదు అని తెలుసుగాని… మరీ దారుణంగా లాజిక్ తో సంబంధం లేకుండా తీసే సీన్స్ నవ్వుల పాలవుతున్నాయి.

ఈ మధ్య తెలుగులో వచ్చిన స్కంద సినిమా ఈ విషయంలో బాగా ట్రోల్స్ కి గురైంది. ఆడియన్స్ పేలవమైన సీన్స్ ని పట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు.ఇలాంటి సీనులు ఎలా తీస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

scene from tejas

తాజాగా ఇప్పుడు మరో మూవీ ట్రోలర్స్ చేతికి చిక్కింది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన తేజస్ మూవీ ప్రస్తుతం జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీలో ఒక సీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ ఆర్మీ హెలికాప్టర్ లో ఒక దీవిలోకి దిగుతుంది. దిగేటప్పుడు తాడు కట్టుకుని దిగి సగ దూరంలో తాడు వదిలేసి సముద్రంలోకి దూకుతుంది. సముద్రం నుండి పరుగున వెళ్లి దీవిలో పడి ఉన్న అతని సహచరుడిని కాపాడాలని ప్రయత్నిస్తుంది.

Ads

scene from tejas

సరిగ్గా అదే టైం లో అది ఒక తెగవారు వీరి పైన దాడి చేయడానికి వస్తారు. వెంటనే కంగనా అతని సహచరుడిని భుజాన్న ఎత్తుకొని సముద్రంలోకి పరిగెడుతుంది. వెంటనే ఆర్మీ హెలికాప్టర్ వచ్చి తాడు ఇవ్వగా ఎగిరి ఆ తాడు అందుకుంటుంది. కింద నుండి తెగవారు బాణాలు వేస్తే అతనికి తగలకుండా అడ్డు ఉండి తనకి గుచ్చుకునేలా చేస్తుంది. ఈ సీను చదువుతుంటేనే ఎటకారంగా అనిపించింది. ఇక తెరపై చూస్తే ఎంత కామెడీగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిని చేరుకుంటుంటే ఇలాంటి సీన్స్ సినిమా స్థాయిని మరింత దిగజారుస్తున్నాయంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

watch video :

Previous articleఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి..?
Next articleఇదేంటి..? గుంటూరు కారం స్టోరీ ఈ సీరియల్ నుండి కాపీ కొట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.