Ads
క్రికెట్ మరియు సినీ సెలబ్రిటీల కెరీర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వారి పర్సనల్ విషయాల గురించి మాత్రం ఎక్కువగా తెలిసే అవకాశం ఉండదు. వారు తమ వ్యక్తిగత జీవితం గురించి బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు.
Ads
ఇక సెలబ్రిటీల పర్సనల్ మరియు వారి పిల్లల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారు. ఇక సెలబ్రిటీ కిడ్స్ చదువు అంటే వేరే లెవల్ లో ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా మిస్టర్ కూల్ ధోనీ కుమార్తె స్కూల్ ఫీజు గురించిన వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎం ఎస్ ధోని వివిధ వాణిజ్య ఒప్పందాలు, ఐపీఎల్ కాంట్రాక్ట్ మరియు వ్యాపారాల ద్వారా ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. రాంచీలో ధోని లావిహ్ ఫామ్‌హౌస్ లో లగ్జరీ, పాతకాలపు కార్లు మరియు బైక్‌ల అద్భుతమైన సేకరణ ఉంది. తను పుట్టి పెరిగిన, ప్రాంతాన్ని, తన చిన్ననాటి స్నేహితులను పేరు, ఐశ్వర్యం వచ్చిన తర్వాత విడిచిపెట్టకుండా అక్కడే జీవిస్తున్నాడు. భారత క్రికెట్‌లో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నప్పటికీ, తన నగరాన్ని విడిచిపెట్టలేక రాంచీలోనే ఉంటున్నాడు.
ధోనీ గారాల తనయ జీవా గురించి తెలిసిందే. ధోనీ రేంజ్ కి ఆమెను విదేశాలలో కూడా చదివించవచ్చు. కానీ ధోనీ జీవాను రాంచీలోని స్కూల్ లోనే చదివిస్తున్నాడు. ప్రస్తుతం జీవాకి 8 ఏళ్ళు, టౌరియన్ వరల్డ్ స్కూల్ లో 3వ తరగతి చదువుతోంది. తెలివైన బాలికగా స్కూల్లో పేరు తెచ్చుకుంది. ఈ స్కూల్ సాధారణ స్కూల్ ఏం కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్. 65 ఎకరాల క్యాంపస్ కలిగిన ఈ స్కూల్ లో సమగ్ర విద్యా విధానాన్ని అందిస్తుంది. గుర్రపు స్వారీ, సేంద్రియ వ్యవసాయం లాంటి పలు శిక్షణలను సైతం అందిస్తుంది.
టౌరియన్ వరల్డ్ స్కూల్ లో డే స్కాలర్ విద్యార్థులకు 2 నుండి 8 తరగతుల వరకు ఏడాదికి రూ. 2,75,000. జీవా 3వ తరగతి కాబట్టి, ఆమె వార్షిక పాఠశాల ఫీజు కూడా అంతే. జీవా డే స్కాలర్ స్టూడెంట్. ఆమె నెలవారీ ఫీజు రూ. 23,000. వార్షిక ఫీజు దాదాపు రూ.4.40 లక్షలు, పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ, స్పోర్ట్స్ డ్రెస్ తో కలిపి దాదాపు రూ.4.80 లక్షలు చెల్లించాలని తెలుస్తోంది.