ఆడవాళ్ళు ఎందుకు కాళ్ళకి పట్టీలని పెట్టుకోవాలి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?

Ads

ఆడవాళ్లు ఖచ్చితంగా నుదుటిని బొట్టు, చేతికి గాజులు, చెవులకి దుద్దులు, ముక్కుకి ముక్కుపుడక. కాళ్ళకి పట్టీలు మెట్టెలు పెట్టుకుంటారు. హిందూ మతం లోని ఆచారాలు సంప్రదాయాలు అవే చెబుతున్నాయి. ఖచ్చితంగా స్త్రీలు ముఖ్యంగా పెళ్లి అయిన మహిళలు వీటిని ధరించాలి. అయితే చాలామంది ఇదేదో ఫ్యాషన్ అని అనుకుంటారు. కానీ నిజానికి వీటిని ధరించడం వెనుక సైన్స్ ఉంది.

పలు రకాల సమస్యలని రాకుండా ఇవి మనల్ని కాపాడతాయి. ఈ ఆభరణాలు ఉండే ప్రాంతంలో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉండే నరాలు ఒత్తిడికి గురి అయ్యి హార్మోన్స్ ని విడుదల చేస్తాయి.

అలానే నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆడవాళ్లు కాళ్ళకి పట్టీలను కూడా పెట్టుకుంటారు. ఎక్కువ మంది పెట్టుకునే పట్టీలు వెండివే. ఎందుకు మనం వెండి పట్టీలని పెట్టుకోవాలి..? వీటిని పెట్టుకోవడం వల్ల అసలు లాభం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం కలిగిందా..? అయితే తప్పకుండా దాన్ని చూసేయండి. వెండి మన శరీరానికి తగిలితే ఒక రసాయన చర్య జరుగుతుంది అలానే విడుదలయ్యే ఎలక్ట్రాన్స్ కాలి భాగంలో ఉండే నరాలని ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది.

Ads

దీనితో నరాల్లో విద్యుత్ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. అలానే కాళ్ళకి వెండి పట్టీలను పెట్టుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు అదుపులో ఉంటాయి. గర్భసంచికి సంబంధించిన సమస్యలు తగ్గి గర్భసంచి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పట్టీలనిపెట్టుకోవాలని అంటారు. వెండి పట్టీలను పెట్టుకోవడం వలన నెలసరి సమస్యలు కూడా రావు. మహిళలు ఆరోగ్యంగా ఉండొచ్చు.

 

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవాళ్లు పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నారు నెలసరిలో ఇబ్బందులు ఎదుర్కోవడం లేదంటే నెలసరి ఆలస్యంగా రావడం ఇటువంటివి. ఇటువంటి సమస్యలు ఉన్న ఆడవాళ్లు పట్టీలను ధరిస్తే ఆయా సమస్యల నుండి బయట పడేందుకు అవుతుంది. మానసిక ఒత్తిడి వలన ఉత్పన్నమవుతున్న హార్మోన్ ఇంబాలెన్స్ కూడా పట్టీలని ధరించడం వలన తగ్గించొచ్చు.

Previous articleకేఎల్ఆర్ చేస్తున్న కృషిని గుర్తుంచిన కాంగ్రెస్ హై కమాండ్ ! మరింత ప్రాధాన్యం మరియు కీలక బాధ్యతలు
Next articleఅమెజాన్ ప్రైమ్ లో ‘పుష్ప’ సినిమాతో పాటు అత్యధిక వ్యూయర్ షిప్ ను సాధించిన 10 సినిమాలు..