శ్రీరామనవమి నాడు వాళ్ళ పిల్లలని అమ్మేసి… మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు… ఎక్కడో తెలుసా..?

Ads

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరాముడు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకి త్రేతా యుగంలో జన్మించారు. ఆయన జన్మదినం రోజున ప్రజలు పండగగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామ నవమి నాడు శ్రీరాముడు ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుతారు సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో భద్రాచలంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవముగా జరుపుతారు. ఆలయ పండితుల చేత జరిగే ఈ కళ్యాణాన్ని చూడడానికి అనేక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్య లో భక్తులు తరలి వస్తారు. శ్రీరామనవమి నాడు కచ్చితంగా పానకం తయారు చేస్తారు.

Ads

బెల్లం, మిరియాలు కలిపి ఈ పానకాన్ని చేస్తారు. అలానే స్వామి వారికి పలు ప్రసాదాలు కూడా చేస్తారు. రంగు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా వసంతోత్సవం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కానీ శ్రీరామనవమి నాడు భక్తులు ఒక చోట పిల్లలను దేవుడికి ఇచ్చేసి ఆ తర్వాత కొనుక్కుంటారు. ఇది ఎక్కడా మీరు విని ఉండరు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో ఈ సాంప్రదాయం ఉంది. ప్రతి ఏటా పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి తిరిగి మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కొనుక్కుంటారు.

కన్న బిడ్డలని గుడికి సమర్పించి తర్వాత కొంత మొత్తం చెల్లించి పిల్లల్ని వెనక్కి తీసుకుంటారు. ఇక్కడ ఈ సాంప్రదాయం ఉంది. దేవునికి పిల్లల్ని ఇవ్వడాన్ని అమ్మేయడం అని వీళ్ళు పిలుస్తారు. పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి మళ్ళీ వాళ్లే కొనుక్కుంటారు. ఇలా చేయడం వలన అంతా మంచే కలుగుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అలానే కళ్యాణం లోని తలంబ్రాలని పరమాన్నం వండుకొని తింటారట. 1889లో ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటినుండి కూడా ఇక్కడ అలానే సాగుతోంది.

Previous articleఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు పెద్ద నాయకుడు అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Next articleఅక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి వచ్చిన వారికి రాసిన ఈ నోట్ చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.