Shaakuntalam Movie Review: శాకుంతలం సినిమా హిట్టా, ఫట్టా…?

Ads

సినిమా: శాకుంతలం
నటీనటులు : సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, మోహన్ బాబు తదితరులు
దర్శకత్వం : గుణశేఖర్
నిర్మాత : నీలిమ గుణ
సంగీతం : మణిశర్మ
విడుదల తేదీ :ఏప్రిల్ 14, 2023

స్టోరీ :

శాకుంత పక్షులు ఒక పసి బిడ్డని పట్టుకుని ఒక దగ్గర పెడతాయి. అక్కడ కన్వ ముని (కృష్ణంరాజు) ఆశ్రమం వుంది. ఆ ముని ఆ పాపని పెంచి పెద్ద చేస్తారు. ఆ బిడ్డ కి శకుంతల(సమంత) అని పేరు పెడతారు. ఒక రోజున పులుల్ని వేటాడుతూ దుష్యంత (దేవ్ మోహన్) రాజు వీరి ఆశ్రమానికి వస్తాడు. అతను అక్కడ వున్న శకుంతలని చూసి ప్రేమ లో పడిపోతాడు. ఆమె కూడా ఆ తరవాత దుష్యంతుడిని ప్రేమిస్తుంది. అయితే ఇరువురి మధ్య కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవేంటి..? శకుంతల- దుష్యంతుడు చివరకు ఒక్కటయ్యారా లేక విడిపోయారా..ఇది సినిమా..

రివ్యూ:

ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయితే చిన్న చిన్న ట్విస్టులు సినిమాలో ఉన్నాయి. ఎంతో చక్కగా గుణశేఖర్ సినిమాని తెర మీదకి తీసుకువచ్చారు ఇప్పటివరకు మహాభారతం చదవకపోయినా శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా సరే సినిమా చూడొచ్చు. సమస్య ఉండదు. సింపుల్ గా ఒక్కో విషయాన్ని క్లియర్ గా స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్. అయితే కథ ని కథలా చెప్పడం మైనస్ అయ్యింది. ఎందుకంటే సినిమా అంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

Ads

కానీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మిస్సయింది. సినిమా మొదటి పార్ట్ లో అయితే ఏ ఎమోషన్ కి మనం కనెక్ట్ అవ్వలేము అలానే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే విధంగా సీన్స్ ఏమీ లేవు.  అలానే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సెట్స్ అయితే కూడా ఏమీ లేవు. గ్రాఫిక్స్ కూడా ఈజీగా గ్రాఫిక్స్ అని తెలిసిపోతున్నాయి. కొన్ని లాజిక్స్ ని కూడా మిస్ అయ్యారు. డైరెక్టర్ సమంత ఇప్పటివరకు చేయలేని పాత్ర చేసింది. కాస్త డిఫరెంట్ గా ఈ పాత్ర ఉంటుంది.

అలానే ఆమె డిఫరెంట్ వేరియేషన్స్ ని చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. నటులు అయితే మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఎవరి పాత్రకి తగ్గట్టు వాళ్ళు బాగానే నటించారు. మణిశర్మ అందించిన పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. త్రీడీ ఎఫెక్ట్ కూడా అన్ని సీన్స్ లోనూ లేవు ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే త్రీడీ ఎఫెక్ట్ ఉంది. ఓవరాల్ గా చూస్తే పరవాలేదు బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • సమంత నటన
  • గుణశేఖ‌ర్ డైరెక్షన్
  • సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • దేవ్ మోహన్ నటన
  • కథ

మైనస్ పాయింట్స్:

  • గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం
  • మిస్ అయిన లాజిక్స్
  • బోర్ కొట్టే సీన్స్
  • నటులకి తక్కువ అవకాశం
  • అంతలా మెప్పించని త్రీడీ
  • సీరియల్ లాగ సాగదీసిన సీన్స్
  • కార్టూన్స్ లాంటి విజువల్స్
  • ఇరిటేటింగ్ గా అనిపించే డైలాగ్స్

రేటింగ్: 2.5/5

Previous articleజనరిక్ మందులు ఎందుకు అంత తక్కువ ధరకే వస్తాయి..? కారణం ఏమిటి అంటే..?
Next articleరాత్రి నిద్రించి విడిచిన బట్టలని మళ్ళీ వేసుకోవద్దు.. ఎందుకో తెలుసా..?