ఖడ్గం మూవీ కోసం నటుడు షఫీ చార్మినార్ వీధుల్లో చేసిన పని ఏమిటో తెలుసా?

Ads

అప్పుడప్పుడు సూపర్ హిట్ అయిన పాత సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి సోషల్ మీడియాలో కనిపించి అందరిని ఆకర్షిస్తూ ఉంటాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో వాటి  గురించి తెలిసి నెటిజెన్లు షాక్ అవుతూ ఉంటారు. ఇక అలానే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం మూవీ చిత్రీకరణ సమయంలో నటుడు షఫీ చేసిన ఓ పని గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం షికారు చేస్తోంది.

Ads

నటుడు షఫీ ఖడ్గం చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ తరువాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ, త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలోను షఫీ తన నటనతో ఆడియెన్స్ ని మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆయన ఇరవై సంవత్సరాల సినీ కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు యాబైకి పైగా చిత్రాల్లో నటించాడు. అయితే షఫీ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే కావాలనుకోవడం వల్ల ఎక్కువ చిత్రాలు చేయలేకపోయాడని చెప్పవచ్చు. అయితే షఫీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా ఒక మూవీలో హీరోగా నటించాడు. కమిలి అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటించాడు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ నందితా దాస్ నటించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. షఫీ చిన్నప్పటి నుండి నాటక రంగానికి, సినిమాకి చాలా ప్రభావితం అయ్యాడు. సినిమాల పై ఉన్న ఆసక్తితో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జాయిన్ అయ్యాడు. దాని ద్వారానే ఖడ్గం చిత్రంలో నటించే అవకాశాన్ని పొందాడు. ఇక ఈ సినిమాలో షఫీ తీవ్రవాది పాత్రలో నటించాడు. అయితే ఆ పాత్రలో నటించడానికి అతను ఏ నటుడు చేయని సాహసం చేశాడు. ఆయన చార్మినార్ వీధుల్లో ఉండే తన మిత్రుడి ఇంట్లోనే నెలరోజుల పాటు అక్కడే ఉండి, వారి అలవాట్లను అర్థం చేసుకొని వచ్చాక, ఖడ్గం సినిమాలో నటించాడంట. అయితే చెప్పాలంటే ఇది ఒక గొప్ప విషయం. అందువల్లే ఆ సినిమాలో షఫీ పాత్రకు అంత పేరు వచ్చింది. ఇక షఫీ చివరగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో కనిపించాడు.

Also Read: చిరంజీవి తన ఫోన్ లో సురేఖ, పవన్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా?

Previous articleదర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేసిన సినిమాలలో ఆయన భార్యకు నచ్చని సినిమా ఏమిటో తెలుసా?
Next articleఅక్కడ జనవరి 29న రిపబ్లిక్ డే.. ఎందుకు అలా జరుపుకుంటున్నారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.