చిరంజీవి తన ఫోన్ లో సురేఖ, పవన్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా?

Ads

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఎవరి సహాయం లేకుండానే పరిశ్రమలో అడుగుపెట్టి, స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు పొంది ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. టాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలపరచుకున్నాడు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.

Ads

మైత్రిమమేకర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా,బాబీ సింహా, సముద్రఖని, బిజు మీనన్ వంటివారు మిగతా పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సుమా అడ్డ షోకి హాజరైన సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఈ షోలో మెగాస్టార్ తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను మొబైల్ లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నారనే విషయాన్ని తెలియచేసారు. ఆయన భార్య సురేఖ పేరును రే,తనయుడు రామ్ చరణ్ పేరును చెర్రీ, తమ్ముడు పవర్ స్టార్ పవన్ పేరును కళ్యాణ్ బాబు అని ఫోన్ లో సేవ్ చేసుకున్నట్టుగా చిరంజీవి తెలిపారు. ఇక సుమ అడ్డా షోకు మెగస్టర్బ్ చిరంజీవి రావడం వల్ల ఈ ఎపిసోడ్ కు రేటింగ్ బాగా పెరుగుతుందని అంటున్నారు.
మెగాస్టార్ ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.ఆయన ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో మెగాస్టార్ ఖచ్చితంగా హిట్ కోట్టడం గ్యారంటీ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి భోళా శంకర్ చిత్రం ఏప్రిల్ లో విడుదల అవనుంది. ఈ సినిమాకి మెహర్ రమేశ్ డైరెక్టర్. భోళా శంకర్ మూవీ పై కూడా అంచనాలు ఉన్నాయి.
తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్, హీరోయిన్ గా తమన్నా నటించారు. తమన్నా ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది. ఇటీవల గాడ్ ఫాదర్ తో విజయం అందుకున్న మెగాస్టార్, రిలీజ్ కాబోయే సినిమాలతో వరుసగా హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్ కు పండగ  

Previous articleVeera Simha Reddy Review: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్ కు పండగ
Next articleవాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. మెగా మాస్ పూనకాలు లోడింగ్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.